ధనుష్‌ హీరోయిన్‌తో రొమాన్స్‌ చేస్తున్న విష్ణు!!

Bollywood beauty Amyra Dastur pairing with Manchu Vishnu

03:19 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Bollywood beauty Amyra Dastur pairing with Manchu Vishnu

డైనమెట్‌ చిత్రం ఫ్లాప్‌ కావడంతో మళ్లీ కామెడీ తరహా చిత్రాలు చెయ్యడానికే మంచు విష్ణు మెగ్గు చూపుతున్నారు. మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం 'సరదా' ప్రస్తుతం ఈ చిత్రం ఘాటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ఘాటింగ్‌లో ఉండగానే విష్ణు మరో మల్టీస్టారర్‌ చిత్రానికి శ్రీకారం చుట్టారు. హ్యాట్రిక్‌ విజయంతో దూసుకుపోతున్న రాజ్‌తరుణ్‌, విష్ణు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి ఇప్పటికే కధను పూర్తి చేసి ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే విష్ణు సరసన బాలీవుడ్‌ బ్యూటీ 'అమీరా దస్తర్‌' ఎంపికైంది. తమిళంలో ధనుష్‌ నటించిన అనేగన్‌ (అనేకుడు) చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు లో విష్ణుతో నటించబోతుంది.

ఇప్పటికే పూరీ జగన్నాద్‌ దర్శకత్వం వహిస్తున్న 'రోగ్‌' చిత్రానికి సైన్‌ చేసింది ఈ సుందరి. ఇలా తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ . అయితే ఇంకా రాజ్‌తరుణ్‌ జంటగా నటించే హీరోయిన్‌ని ఎంపిక చెయ్యాల్సిఉంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి ఆఖరులో సెట్స్ పైకి వెళ్లనుంది.

English summary

Bollywood beauty Amyra Dastur pairing with Manchu Vishnu. It is directing by G. Nageswara Reddy and it is a multistarrer movie.