కళ్యాణ్ రామ్ సినిమాలో మెగాస్టార్!

Bollywood big b Amitabh Bachchan in Kalyan Ram movie

03:56 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Bollywood big b Amitabh Bachchan in Kalyan Ram movie

పటాస్, షేర్ చిత్రాల తరువాత కళ్యాణ్ రామ్ తాజాగా స్పీడ్ మరియు డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మిస్ ఇండియా 2015 అదితి ఆర్య నటించబోతుంది. ఎప్పటిలానే ఐ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ చిత్రంలో 15 నిముషాల నిడివి గల ఒక పాత్ర ఉంది. ఇందులో ఈ పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది. అయితే ఈ పాత్రకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాభ్ బచ్చన్ ని నటింపజేయాలని పూరి ఆలోచనట.

అమితాబ్ బచ్చన్ 2011లో పూరి దర్శకత్వంలో 'బుడ్డా హోగా తేరా బాప్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం కూడా సాధించింది. దీనితో వీళ్ళద్దరి మధ్య మంచి స్నేహం కూడా కుదిరింది. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ చిత్రంలో నటించిమని పూరి అమితాబ్ ని అడిగితే నటించే అవకాసం ఉందని చెప్తున్నారు. నిజంగా ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తే ఈ చిత్రానికి స్పెషల్ క్రేజ్ రావడం ఖాయం. అంతే కాదు ఈ చిత్రాన్ని హిందీ లో కూడా రిలీజ్ చేస్తే ఎలాగో అమితాబ్ వుంటాడు కాబట్టి కలెక్షన్స్ రావడం కూడా ఖాయం.

English summary

Bollywood big b Amitabh Bachchan in Kalyan Ram movie. Kalyan Ram latest movie is directing by Puri Jagannadh. In this movie Miss India 2015 Aditi Arya is acting as a heroine and Bollywood Big B Amitabh Bachchan is playing a key role.