ఇంతకీ హృతిక్ ఇంట్లో ఏముంది?

Bollywood celebrities are giving competition for this house

11:12 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Bollywood celebrities are giving competition for this house

ఈమధ్య బాలీవుడ్, టాలీవుడ్ నటులు ఇళ్ళు కొనేసి, ఎంచక్కా అందులో ఎంజాయ్ చేస్తున్నారు. అదేరీతిలో కండలవీరుడు హృతిక్ రోషన్ ఒక ఇంటి వాడయ్యాడు. హీరో అన్నాక.. డబ్బులు రావా? ఇల్లు కట్టుకోడా అనుకుంటున్నారా? ఇల్లు కట్టుకుంటే విశేషం ఏమీలేదు. కానీ, ఆ ఇంటిని చూడడానికి బాలీవుడ్ ప్రముఖులంతా క్యూ కడితే అందులో విశేషం ఉన్నట్లే కదా? విశేషం ఏమిటంటే.. హృతిక్ కట్టుకున్న ఇల్లు అలాంటిలాంటి ఇల్లు కాదు. ఈ ఇంటిని భారతదేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ ఆశీష్ షా నిర్మించాడు. సముద్రతీరంలో నిర్మించిన ఈ ఇంటిలో సకల సౌకర్యాలను అద్భుతమైన రీతిలో ఆశీష్ షా అలంకరించాడు.

డైనింగ్ హాల్, లివింగ్ రూం, కిడ్స్ రూం, సినిమా హాల్, హృతిక్ ఆఫీస్ ను ఒక్కసారి చూస్తే అక్కడే ఉండిపోవాలి అనిపించేంతలా రూపొందించాడు. ఈ విషయం చిన్నగా బాలీవుడ్ లోని ప్రముఖుల చెవిన పడడంతో ఆ ఇంట్లో ఉండడం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి కనీసం ఒక్కసారి చూద్దామని వాళ్లంతా హృతిక్ ఇంటి ముందు క్యూ కడుతున్నారట. అంతలా ఆకట్టుకునే ఆ ఇంట్లో ఏముందో కాస్త మీరు కూడా ఓ లుక్కెయ్యండి మరి.

English summary

Bollywood celebrities are giving competition for this house