పవన్ ఒక జోకర్.. బాలీవుడ్ నటుడు పైత్యం

Bollywood comedian says Pawan Kalyan is joker

06:48 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Bollywood comedian says Pawan Kalyan is joker

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నార్త్ లో ఒక స్టార్ హీరో. పవన్ అంటే పడిచచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పవన్ ని దేవుడు గా భావించి గుడి కట్టాలని చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే అలాంటి హీరో పై బాలీవుడ్ కమీడియన్ కమల్ ఆర్ ఖాన్ విరుచుకుపడ్డాడు. పవన్ ఓ జోకర్ అంటూ ట్వీట్స్ చేశాడు. పవన్ సినిమాలకు బదులు రాజపాల్ యాదవ్ సినిమాలు చూస్తానంటూ రాసుకొచ్చాడు. పవన్ కూడా హీరోయే అయితే, ప్రపంచంలో ఎవరైనా హీరో కావచ్చు... అసలీ సౌత్ ఇండియా జనాలకు ఏమైంది? ఈ కార్టూన్‌ను వాళ్లెలా చూస్తున్నారు? అయితే కమల్ ఆర్ ఖాన్ పై పవన్ ఫాన్స్ తనదైన రీతిలో సమాధానం చెప్పారు.

నిన్ను(కమల్ ఆర్ ఖాన్) అక్కడ ఎవరూ పట్టించుకోరు అని పవన్ ఫ్యాన్స్ వాదించారు. ఎందుకంటే కమల్‌ ఇలాంటి కాంట్రవర్సీలు చేయడం, పబ్లిసిటీ సంపాదించుకోవడం అతని హాబీగా చెబుతున్నారు. తమ హీరో మీద అతను చేసిన ట్వీట్స్ వల్ల పెద్దగా నష్టం ఉండదని, సింహాన్ని చూసి కుక్కలు మొరగడం మామూలే అని కామెంట్స్ చేసేసారు. మరోవైపు 'సర్దార్' సినిమాని పవన్ బాలీవుడ్‌లో రిలీజ్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్‌తో నార్త్ ఆడియన్స్‌ నెగిటివ్ థింకింగ్‌ చేస్తారన్న అభిప్రాయాన్ని పవన్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' కి సంబంధించిన టీజర్లని నిన్న విడుదల చేశారు.

ఇవి చూసి బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ టీజర్ అదిరిపోయిందని కామెంట్ చేశాడు. అభిషేక్ బచ్చన్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని ఇంతకముందే చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడు తాజాగా తన అభిమానాన్ని మరో సారి చాటుకున్నాడు.English summary

Bollywood comedian says Pawan Kalyan is joker. Bollywood comedian Kamal R khan comments Pawan Kalyan that he is joker.