బిజినెస్ మెన్ ని రాత్రి కల్సిన హీరోయిన్.. ఉదయానికి షాక్ ఇచ్చింది!

Bollywood heroine cheated a businessman

02:32 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Bollywood heroine cheated a businessman

ఓ వ్యాపారస్తుడు వ్యాపారం కోసం వచ్చి ఓ యువతీ చేతిలో ఘోరంగా మోసపోయాడు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వ్యాపారస్తుడు బస చేయగా.. అనుకోకుండా బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి, హీరోయిన్ చాన్స్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న ఓ నటి డిన్నర్ లో కలిసి.. ఆపై రూ. 46 లక్షల విలువైన వాచ్ తో పాటు లక్షల రూపాయలను కాజేసి వెళ్లింది. వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తనను కలిసిన యువతితో డిన్నర్ ముగించుకున్న వ్యాపారి, మరుసటి రోజు ఉదయం కలుద్దామని ఆమెకు చెప్పి పంపాడు.

పొద్దున్నే నిద్ర లేచి చూసే సరికి తన చేతికి ఉండాల్సిన రూ. 46 లక్షల విలువైన వాచ్.. గదిలో ఉన్న లక్షల నగదు కనిపించలేదు. దాంతో ఆ యువతికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. కేసును విచారిస్తున్న పోలీసులు.. వ్యాపారికి ఢిల్లీలో సొంత ఇల్లు ఉందని గుర్తించడం గమనార్హం. సొంతిల్లున్నా ఆయన హోటల్ ను ఎందుకు ఆశ్రయించాడు? అసలు హోటల్ గదిలో ఏం జరిగింది? అనే విషయాలను కనిపెట్టేందుకు విచారణ మొదలు పెట్టారు.

ఇది కూడా చదవండి: సొంత ఇంటిని అమ్మకానికి పెట్టిన టాప్ డైరెక్టర్!

ఇది కూడా చదవండి: ఇలా ప్రవర్తిస్తున్నారంటే వారు ఆత్మహత్యకు సిద్ధమయినట్లే

ఇది కూడా చదవండి:శివ పూజకు వాడేవి, వాడకూడనివి ఏమిటో తెలుసా

English summary

Bollywood heroine cheated a businessman. Bollywood character artist and upcoming heroine meets a businessman at night. For the morning she stolen his watch and lakhs of money.