బాలీవుడ్ లెజండరీ సింగర్ ఇక లేరు

Bollywood Legendary Singer Mubarak Passed Away

11:01 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Bollywood Legendary Singer Mubarak Passed Away

ప్రముఖ నేపథ్య గాయకురాలు, బాలీవుడ్ లెజండరీ సింగర్ ముబారక్ బేగం కన్నుమూశారు. ఈమె వయసు 76 సంవత్సరాలు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దిగ్గజ సంగీత దర్శకులైన ఎస్ డీ బర్మన్, శంకర్ జైకిషన్, ఖయ్యం తదితరులతో కలిసి పనిచేశారు. 1950-60లలో తన గానామృతంతో ఎన్నో పాటలకు ఆమె ప్రాణం పోశారు. కభి తన్హాయియో మే హమారి యాద్ ఆయేగి , వో నా ఆయేగీ పలట్ కర్ వంటి పాటలతో అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చివరలో ఆర్థిక సమస్యలతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె మరణవార్త విన్న బాలీవుడ్ తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. పలువురు ఈమె భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఇవి కూడా చదవండి:రానా తమ్ముడు హీరోగా ‘లేడీస్ టైలర్’ సీక్వెల్

ఇవి కూడా చదవండి:అందాల ఆరబోతతో సమంత రెచ్చిపోయిన ఫోటోషూట్(వీడియో)

English summary

Bollywood Legendary Singer Mubarak Passes Away at the age of 76. She was suffering from illness from last few weeks.