భారీగా దొరిగిన డ్రగ్స్ .. పోలీసుల అదుపులో ప్రొడ్యూసర్

Bollywood producer Subash Dudhani Arrested

05:02 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

Bollywood producer  Subash Dudhani Arrested

ఏ పుట్టలో ఏ పాముందో తెలీదు కదా. ఇప్పుడు ఎక్కడ నేరం జరిగినా అందులో పట్టుబడేవాళ్లు మామూలు మనుషులు కాదనేలా ఉంటోంది. తాజాగా భారీ డ్రగ్ రాకెట్ గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్- డీఐఆర్ రట్టు చేసింది. యిది మామూలు యవ్వారం కాదు. ఎందుకంటే దీని విలువ అక్షరాలా మూడువేల కోట్ల రూపాయలు. పైగా ఈ స్థాయిలో నారోటిక్ డ్రగ్స్ పట్టుబడడం దేశంలో ఇదే ఫస్ట్ టైమ్. అక్టోబర్ 28న రాజస్థాన్ లోని ఉదయపూర్ సమీపంలో మరుధర్ డ్రింక్స్ కంపెనీపై డీఆర్ ఐ అధికారులు దాడులు చేశారు.

నిషేధిత మ్యాండ్యాక్స్ ట్యాబ్లెట్స్ అధికంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ టాబ్లెట్ల బరువు 23 వేల 500 కేజీలు. అంతర్జాతీయ మార్కెట్లో అయితే 4,500 కోట్ల రూపాయలు విలువ చేయవచ్చన్నది అంచనా! ఈ డ్రగ్ వ్యవహారంతో సంబంధమున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ సుభాష్ దుధానిని అదుపులోకి విచారిస్తున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: సెలబ్రిటీలు ఒక్కసారిగా బరువు తగ్గడానికి ఏ జ్యూస్ తాగుతారో తెలుసా?

ఇది కూడా చూడండి: ఆడవాళ్ళకు బట్టతల ఎందుకు రాదో తెలుసా?

English summary

Bollywood producer Subash Dudhani arrested. Biggest ever drug seizure done by DRI.