జాతీయగీతం వివాదం పై స్పందించిన బాలీవుడ్‌ 

Bollywood Responds To National Anthem Debate

05:10 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Bollywood Responds To National Anthem Debate

సినిమా ధియేటర్‌లో జాతీయగీతం వస్తున్నప్పుడు ధియేటర్‌ లోని అందరు ప్రేక్షకులు నిలబడగా ఒక ముస్లిం కుటుంబం మాత్రం నిలబడలేదని వారి పై దాడి చేసి ధియేటర్‌ బయటకు గెంటేసిన ఘటన పై బాలీవుడ్‌ లోని పలువురు నటులు స్పందించారు.

బాలీవుడ్‌ యాక్టర్‌ అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ జాతీయగీతాన్ని పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు లేచి నిలబడాలని, అందులో వేరే అనుమానం లేదని అన్నారు. మీరు భారతీయిలు అయితే తప్పకు లేచి నిలబడాలి.అంతే కానీ ఈ విషయంలో ఎటువంటి చర్చ లేదని అన్నారు. నేను నా కుటుంభం ఎప్పుడు జాతీయగీతం పాడినప్పుడు నిలబడతామని అన్నాడు. జాతీయగీతాన్ని సినిమా ముందు కాని ఎదేనా మ్యాచ్‌ ముందు కానీ పాడినప్పుడు లేచి నిలబడడం తప్పని సరి కాదని అన్నారు. నేను ప్రపంచంలో ఏమూల ఉన్నా జాతీయగీతం వినగానే లేచి నిలబడతానని మనం అదే మనదేశాన్ని,మనల్ని కాపాడుతున్న జవాన్లకు ఇచ్చే గౌరవమని అన్నారు.

నటి రవినా టాండన్‌ స్పందిస్తు ఈ రోజు భారత్‌కు భాదాకరమైన రోజని తన ట్విట్టర్‌ పేర్కొంది. మన దేశ గీతాన్ని పాడుతున్నప్పుడు ఒక భారత దేశపౌరుడిగా మన కర్తవ్యం మనం చెయ్యాలని అన్నారు. భారతీయ జాతీయ గీతం పాడుతున్నప్పుడు నేను చాలా గర్వంగా అనుభూతి చెందుతానని అది తనలో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు.

English summary

Bollywood actors has said their views on the national anthem debate. Previously a muslim family in mumbai has thrown out of the theatre when they not stand and respect India's National Anthem