మహేష్ బావని చూసి షాకైన బాలీవుడ్!

Bollywood shocks after watching Sudheer Babu in Baaghi trailer

01:26 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Bollywood shocks after watching Sudheer Babu in Baaghi trailer

'ఎస్ఎమ్ఎస్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు కి స్వయాన బావ. మొదటి చిత్రంలోనే మంచి నటనని కనబర్చిన సుధీర్ ఆ తరువాత 'ప్రేమ కథాచిత్రమ్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తరువాత వరుస పెట్టి ఫ్లాప్స్ రావడంతో సుధీర్ కెరీర్ కాస్త స్లో అయింది. అయితే ఇటీవలే విడుదలైన 'భలే మంచిరోజు' చిత్రంతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. దీనితో పాటు బాలీవుడ్ లో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు.

సబ్బీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న 'బాఘీ' చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తుండగా ఇతని సరసన శ్రధ్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించిన ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు. ఇందులో సుధీర్ విలన్ గా ఇరగదీశాడు. ఈ ట్రైలర్ చూశాక సుధీర్ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయాడు. అసలు ఎవరీ సుధీర్ బాబు అంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.

ఇంతకీ సుధీర్ బాబు ఎవరు అని ఆరా తియ్యడంతో సుధీర్ స్వయానా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి బావ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ చిత్రం విడుదలయ్యాక సుధీర్ ఇక స్టార్ అయిపోతాడు అనుకుంటున్నారంతా. ఒక్కసారి మీరు కూడా ఆ ట్రైలర్ పై ఒక లుక్ వెయ్యండి.

English summary

Bollywood shocks after watching Sudheer Babu in Baaghi trailer. Sudheer Babu is acting in negative role in Baaghi movie.