10 కోట్లు తిరిగిచ్చేసిన బాలీవుడ్ స్టార్ హీరో!!

Bollywood star hero returns his 10 crores remunertaion

09:43 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Bollywood star hero returns his 10 crores remunertaion

ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు తమ సినిమా లు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరుస్తుంటే తమ వంతు సాయంగా నిర్మాతలకు వాళ్ళు తీసుకున్న పారితోషకం తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ కోవలో సౌత్ నుండి సూపర్ స్టార్ రజిని కాంత్, స్టార్ హీరో సూర్య ఎప్పుడూ ముందు ఉంటారు. తాజాగా ఈ కోవలోకి మరో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ వచ్చారు. రణబీర్ కపూర్-దీపిక పదుకొనే తాజాగా నటించిన చిత్రం 'తమాషా'. భారీ అంచనలతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీనితో ఈ చిత్ర నిర్మాత భారీగా నష్టపోయాడు. నిర్మాత ని కాపాడేందుకు రణబీర్ తన వంతు సాయంగా తాను తీసుకున్న పారితోషకంలో 10 కోట్లు తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయం విన్న కొంత మంది బాలీవుడ్ స్టార్ లు రణబీర్ ని అభినందిస్తున్నారు.

English summary

Bollywood star hero Ranabir Kapoor returns his 10 crores remunertaion to Tamasha movie producer.