హృతిక్ భారీ డీల్ - రూ.550 కోట్లు

Bollywood Star Hrithik Roshan 550 Crores Deal

11:30 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Bollywood Star Hrithik Roshan 550 Crores Deal

వచ్చే నెలలో ‘మొహంజదారో’తో ప్రేక్షకుల ముందుకు స్టార్ హీరో హృతిక్ రోషన్ రాబోతున్నాడు. ఈనేపధ్యంలో స్టార్ టీవీతో కుదుర్చుకున్న ఓ భారీ డీల్ ఇప్పుడు బాలీవుడ్ లో చర్చకు దారితీసింది. ఇంతకీ విషయం ఏమంటే, దీని తర్వాత రాబోతున్న తన ఆరు సినిమాల శాటిలైట్ హక్కులను ఆయన రూ.550 కోట్లకు అమ్మేశాడు. గతంలో హృతిక్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయకేతనం ఎగురవేడయంతో ఈ డీల్ ను కుదుర్చుకునేందుకు స్టార్ టీవీ ముందుకొచ్చింది. ప్రస్తుతం తన సొంతబ్యానర్ పై హృతిక్ తెరకెక్కిస్తున్న కాబిల్ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే నాడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లకముందే దాని శాటిలైట్ హక్కులను రూ.45 కోట్లకు విక్రయించాడు. కాగా గతంలో బాలీవుడ్ కండల వీరుడు, సుల్తాన్ సల్మాన్ ఖాన్ కూడా ఓ చానెల్ తో ఇటువంటి ఒప్పందమే కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో యువనటుడు వరున్ ధావన్ కూడా చేరాడు. జుడ్వా-2 తర్వాత వచ్చే తన అన్ని సినిమా హక్కులను ఓ టవీ చానెల్ కు రూ.300 కోట్లకు కట్టబెట్టాడు.

ఇది కూడా చూడండి: చేతి రేఖలు ( ‘M’) ఆకారంలో ఉంటే, ఏమవుతుందో తెలుసా ?

ఇది కూడా చూడండి: అపరిచితులతో డేటింగ్ చేసేసారు...

ఇది కూడా చూడండి: ఈ నలుగుర్నీ ఎందుకు కొట్టారంటే... (వీడియో)

English summary

Bollywood Star Hrithik Roshan 550 Crores Deal.