బాలీవుడ్ తారలు కొలిచే సిద్ధి వినాయకుడు

Bollywood Stars Favourite God Siddivinayaka Temple

10:59 AM ON 16th December, 2016 By Mirchi Vilas

Bollywood Stars Favourite God Siddivinayaka Temple

గణనాధుడు .. విఘ్నేశ్వరుడు .. ప్రమథ గణాధిపతి ... ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకునే వినాయకునికి పూజ చేయందే ఎటువంటి శుభకార్యాలను ప్రారంభించమనే సంగతి చెప్పక్కర్లేదు. చాలామంది తమ ఇళ్ల ముంగిట కూడా వినాయక విగ్రహాలను పెట్టుకుంటూ వుంటారు. అయితే మహాకాయుడైన ఆ విఘ్నేశ్వరుడు ముంబయిలో శ్రీ సిద్ధివినాయకుడిగా విశేషపూజలను అందుకుంటున్నాడు. చిన్న మందిరంగా వున్న ఈ ఆలయం కాలక్రమేణా దేశంలోనే అత్యధిక ఆదాయం కల ఆలయాల్లో ఒకటిగా మారడం లంబోదరుని మహిమ అని భక్తులు విశ్వసిస్తారు.

1/6 Pages

1. సంతాన గణపతి ...

ముంబయిలోని ప్రభాదేవి ప్రాంతంలో ఈ మందిరం నెలకొనివుంది. 1801లో ఈ ఆలయాన్ని అగ్రిసమాజ్ కు చెందిన ద్యూబయి పాటిల్ ఆర్థికసాయంతో కాంట్రాక్టర్ లక్ష్మణ్ వితు పాటిల్ నిర్మించారు. ద్యూబాయి పాటిల్ కు పిల్లలు లేరు. అయితే వినాయకుడి దర్శనం కోసం వచ్చే సంతానం లేని మహిళలకు సంతానం కలిగేలా చల్లనిచూపు చూడాలని ఆమె ఆ గణనాధున్ని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఫలం వల్ల అనేకమంది సంతానం లేని మహిళలకు సంతానం కలగడంతో ఈ వినాయకుని దివ్యమహత్తు దేశమంతటా వ్యాపించింది. దీంతో ఆయన దర్శనం కోసం వస్తున్న వేలమందితో మందిరం సందడిగా వుంటుంది. సిద్ధివినాయకుడిని సవసచ గణపతిగా భక్తులు పిలుస్తారు. అంటే మరాఠీ భాషలో కోరిన కోర్కెలు తీర్చేవాడని అర్ధమట.

English summary

Bollywood Stars Favourite God Siddivinayaka Temple.