నా ఇంటిపై నాలుగు సార్లు బాంబు దాడులు 

Bomb attack on Kodela for 4 times

12:32 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Bomb attack on Kodela for 4 times

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఆతర్వాత మీడియాతో మాట్లాడిన స్పీకర్ డాక్టర్ కోడెల ఆవేదనగా తన మనోభావాలు పంచుకున్నారు. తనపై విశ్వాసం ఉంచిన సభకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు స్పీకర్ కోడెల పేర్కొంటూ, తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కొంచెం బాధగా ఉందన్నారు. స్పీకర్ గా తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నట్లు ఆయన చెప్పారు. తన ఇంట్లో బాంబులు పేలాయన్న మాట వాస్తవమని అయితే ఆ ఘటనకు తనకూ ఎటువంటి సంబంధం లేదన్నది కూడా వాస్తవమేనని స్పీకర్ డాక్టర్ కోడెల స్పష్టం చేశారు. తన ఇంట్లో బాంబులు పేలాయన్న విషయయమై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని అయితే తనపై నాలుగు సార్లు బాంబు దాడులు జరిగాయని ఆయన అన్నారు.

ఫ్యూడల్ వ్యవస్థపై జరిగిన పోరాటంలో భాగంగా నలుగురు కుటుంబ సభ్యులను కూడా కోల్పోయినట్లు డాక్టర్ కోడెల గుర్తు చేశారు. 35 ఏళ్లుగా వైద్య వృత్తి నిర్వర్తించానని తాను కోరుకుని రాజకీయాల్లోకి రాలేదని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయ అరంగేట్రం చేశానని చెప్పారు.తాను చిన్నప్పుడు అనేక కష్టాలు పడ్డానని భావి తరాలు అలాంటి కష్టాలు పడకూడదనే నా కోరిక అని కోడెల అన్నారు. 20 ఏళ్లుగా సభలో ఉండటం వల్ల స్పీకర్ గా చేయగలనన్న నమ్మకం ఉందని అన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తున్నానని డాక్టర్ కోడెల చెప్పారు.

English summary

Speaker said,I was targeted with a Bomb attack for four times. As part of the fight against the feudal system, I lost 4 family members.