బెంబేలెత్తుతున్న టర్కీ.. మ్యారేజ్ వేడుకలో 30 మందిని చంపేశారు

Bomb Blast At Marriage In Turkey

11:08 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Bomb Blast At Marriage In Turkey

ఈమధ్యే టెర్రరిస్టుల దాడితో వణికిపోయిన టర్కీ, మరోసారి ఉలిక్కి పడింది. వరుస టెర్రరిస్టుల దాడులతో టర్కీ ఎటువైపు నుంచి బాంబులు వచ్చిపడతాయోనని అక్కడి ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. లేటెస్ట్ గా శనివారం రాత్రి ఓ మ్యారేజ్ వేడుకపై కన్నేసి 30 మందిని చంపేశారు. మరో 94 మంది గాయపడ్డారు. సిరియా బోర్డర్ ప్రాంతంలోని టర్కిష్ పట్టణంలోవున్న గజియాన్ టెప్ లో ఓ వివాహ వేడుక జరుగుతోంది. అందులో ఓ సూసైడ్ బాంబర్, శరీరమంతా బాంబులు అమర్చుకుని వేడుకలోకి వచ్చి తనకుతాను పేల్చుకుని మారణహోమం సృష్టించాడు. టర్కీలో ఉగ్రదాడి జరగడం ఏడాది కాలంలో ఇది థర్డ్ టైమ్. ఈ దాడి పూర్తివివరాల్లోకి వెళ్తే,

టర్కీలోని గజియన్ టెప్ నగరం.. శనివారం రాత్రి 10 గంటల సమయం.. నగరంలోని ఓ మైదానంలో వివాహ వేడుక జరుగుతోంది.. వధూవరుల తరఫు బంధుమిత్రులందరూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు.. అంతలో భారీ విస్ఫోటనం సంభవించింది. క్షణాల్లో ఆనందం ఆవిరైపోయింది. అప్పటి వరకు ఉత్సాహంతో నృత్యాలు చేసిన మహిళలు, చిన్నారులుసహా పలువురు విగతజీవులుగా మారిపోయారు. ఎటుచూసినా మాంసం ముద్దలతో వివాహవేదిక రక్తసిక్తమైంది. అతిథుల్లో కలిసిపోయిన ఓ ఐఎస్ బాల ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 100 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఘటనలో వధూవరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సూసైడ్ బాంబర్ వయస్సు 12 ఏళ్లు!...

ఐఎస్ ముష్కరుల వికృతరూపం మరోసారి బయటపడింది. ముక్కుపచ్చలారని చిన్నారుల మనస్సుల్లో విద్వేషబీజాలు నాటి వారిని ఉగ్రవాదులుగా ఐఎస్ తీర్చిదిద్ధి, తాజాగా ఆత్మాహుతి దాడుల్లోనూ వారిని పావులుగా వాడుకుంటోంది. టర్కీలో దాడికి పాల్పడిన సూసైడ్ బాంబర్ వయస్సు 12 ఏళ్లని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. అయితే ఆ బాలుడు తనంతట తాను పేల్చేసుకున్నాడా లేక అతని వెంట వచ్చిన ఇద్దరు ముష్కరులు బాలుడిని పేల్చేసి ఘటనాస్థలం నుంచి తప్పుకొన్నారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన చిన్నారి అతిథులతో కలిసిపోయి నృత్యం చేశాడు. చిన్నారితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఘటన తర్వాత వారు కనిపించలేదు అని పెళ్లికొడుకు బంధువు ఒకరు తెలిపారు. మరికొద్దిసేపటిలో వివాహవేడుకలు ముగుస్తాయనగా పెద్దఎత్తున విస్పోటనం సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా రక్తం.. తెగిపడిన అవయవాలతో నిండిపోయింది అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా నుంచి పలువురు సిరియన్లు సరిహద్దులు దాటి తలదాచుకొనేందుకు గజియన్ టె్ పకి వస్తుంటారు. శరణార్థులతోపాటు పలువురు ఐఎస్ ఉగ్రవాదులు సైతం నగరంలో ఆశ్రయం పొందుతున్నారని టర్కీ ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.

English summary

Turkey again got shocked with Bomb Blasts by Terrorists. Now Terrorists attacked in a marriage event by killing himself with an suicide bomber. Turkey government said that the suicide bomber was a 12 year old boy. 50 people were died in this Terrorist Attack.