ఆఫ్గాన్ లో పేలుడు - 20 మంది ఉద్యోగులు మృతి

Bomb blast in Afghanisthan

02:53 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Bomb blast in Afghanisthan

తీవ్రవాదం పై ఎంత పోరాడుతున్నా, దుశ్చర్యలు ఆగడం లేదు. ఎక్కడో అక్కడ తీవ్రవాదులు పేట్రేగిపోతూనే వున్నారు. తాజాగా ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో సోమవారం ఉదయం ఓ మినీ బస్సులో ఆత్మాహుతి దాడికి తెగబడింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర సర్వీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు బస్సులో కార్యాలయాలకు వెళుతుండగా ఈ పేలుడు సంభవించిందని పోలీసు అధికారులు తెలిపారు. మృతులను ఇంకా గుర్తించలేదు. రంజాన్ మాసంలో ఈ ఘోరం చోటుచేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

తాలిబన్ నేత ముల్లా అక్తర్ మన్సూర్ మృతికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

English summary

Bomb blast in Afghanisthan