చింటూ ను చంపడానికే బాంబు పెట్టారా?

Bomb Blast In Chittoor District Court

04:55 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Bomb Blast In Chittoor District Court

ఎవరీ చింటూ , ఏమా బాంబు అనుకుంటున్నారా? ఒకసారి ఫ్లాస్ బ్యాక్ కి వెళ్తే, చిత్తూరు మేయర్ దంపతులను దారుణంగా మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలోనే మర్డర్ చేసిన కేసులో ప్రాధాన నిందితుడు ఇతడే ... మేయర్ కి స్వయానా మేనల్లుడైన చింటూ పక్కా స్కెచ్ వేసి మేయర్ దంపతులను లేపెసాడు. పట్టపగలే దారుణం చోటుచేసుకోవడంతో ఎపి సిఎమ్ చంద్రబాబు కూడా అప్పట్లో సీరియస్ స్పందించారు. ఎట్టకేలకు చింటూ ని ప్రధాన నిందితుడుగా నిర్దారించడం , ఆతర్వాత అతడు నేరుగా కోర్టులో లొంగిపోవడం తెల్సిందే. మరి ఇప్పుడు కదేమిటంటే, చిత్తూరు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో గురువారం బాంబు పేలుడు సంభవించింది. కారు ధ్వంసం కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలయిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ప్రొటోకాల్‌ వాహనంలో దుండగులు బాంబులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో పేలని మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. అయితే, చిత్తూరు మేయర్‌ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూను కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో పేలుడు జరిగింది. దీంతో చింటూ ని టార్గెట్ చేసుకునే బాంబు పేలుడు జరిగిందా , మరో ఘటన కు సంబంధించా అనేది తేలాల్సి వుంది.

ఇవి కూడా చదవండి : చెల్లిని గర్భవతిని చేసిన అన్న

ఇవి కూడా చదవండి :

వేదిక మీద కాటేసిన పాము.. అయినా పాడుతూ ప్రాణాలు

ఎయిర్ హోస్టెస్ లు విమానం

ఛీ ఛీ.. ఐఏఎస్ ఇంట్లో టీవీ తారల వ్యభిచారం

English summary

A Bomb Blasted near Chittoor District Court during when Chintu was taking to Court by the police. Chintu was the main Accused person in Chittoor Mayor Couple Murder Case.