అమెరికాలో పేలుళ్లు.. అయితే పేలని కుక్కర్ బాంబ్!

Bomb blasts in America

03:03 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Bomb blasts in America

పెద్దన్న పాత్ర పోషించే, అగ్రరాజ్యం అమెరికా బాంబు పేలుళ్లతో మళ్ళీ దద్ధరిల్లింది. తాజాగా న్యూయార్క్ పరిధిలోగల మన్ హటన్ లోని వెస్ట్ 23 వీధిలోని డంప్ యార్డులో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. మొత్తం రెండు చోట్ల పేలుడు పదార్థాలు పెట్టారు. విస్ఫోటనంలో 29 మంది గాయపడ్డారు. రెండో బాంబును రోబో సాయంతో పరీక్షించారు. అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉగ్రవాదుల కుట్రా? అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. న్యూజెర్సీలో ఛారిటీ రేస్ జరుగుతున్న సమయంలో పైప్ బాంబు పేలిందని, ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఈ విస్ఫోటనం చోటు చేసుకుందని అధికారులు చెప్పుకొచ్చారు.

1/12 Pages

హమ్మయ్య అది పేలలేదు...


అక్కడితో అధికారులు తనిఖీలు ఆపకుండా, కనీసం రెండు చోట్ల పేలుడు పదార్థాలు పెట్టి వుంటారనే అనుమానంతో సోదాలు జరిపారు. చివరకు అధికారుల అనుమానాలు నిజమయ్యాయి. తొలి విస్ఫోటనం వెస్ట్ 23 వీధిలో జరగ్గా రెండో పేలుడు పదార్థాన్ని వెస్ట్ 27 వీధిలో అంటే నాలుగు బ్లాకుల దూరంలో కనిపెట్టారు. ఇది 2013లో బోస్టన్ మారథాన్ లో వినియోగించిన ప్రెషర్ కుక్కర్ తరహా బాంబు కావడం గమనార్హం. పేలుడు జరిగిన దాదాపు మూడు గంటల తర్వాత దీనిని గుర్తించారు. ప్రెషర్ కుక్కర్ కు సంబంధించిన చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అవుతోంది. కుక్కర్ కు వైర్లతో ఓ మొబైల్ ఫోన్ అనుసంధానమై వుంది. ఈ చిత్రం సరైనదే అని పోలీసులు ధ్రువీకరించారు.

English summary

Bomb blasts in America. Huge bomb blasts in United States of America. But cooker bomb was not blasted.