బంగ్లాదేశ్ లో మళ్లీ పేలుళ్లు

Bomb blasts in Bangladesh

12:37 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Bomb blasts in Bangladesh

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిని మరువకముందే మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలో కిషోర్ గంజ్ ప్రాంతంలోని ఈద్గా మైదానం సమీపంలో గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కాన్వాయ్ లక్ష్యంగా బాంబులు విసిరారు. పేలుడు దాటికి పోలీసుతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి జరిగిన సమయంలో ఈద్గా మైదానంలో దాదాపు 3 లక్షల మంది ప్రార్ధనలు చేస్తున్నారు. పేలుడు ఘటనను బంగ్లాదేశ్ సమాచారశాఖ మంత్రి హసనుల్ హక్ ధ్రువీకరించారు.

దాడి జరిపిన అనంతరం ఆగంతకులు అక్కడే ఉన్న ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కిషోర్ గంజ్ లో ముష్కరులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా గత శుక్రవారం ఆర్టిసన్ కేఫ్ లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary

Bomb blasts in Bangladesh