బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బ్రస్సెల్స్

Bomb Blasts In Belgium Capital Brussels

04:15 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Bomb Blasts In Belgium Capital Brussels

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ బాంబు పేలుళ్ళ తో అట్టుడికిపోయింది. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అలాగే రైల్వే స్టేషన్ దగ్గర బాబు దాడి జరింగింది. మంగళవారం విమానాశ్రయంలోని డిపార్చర్‌ హాల్‌వద్ద అమెరికా ఎయిర్‌లైన్స్‌ డెస్క్‌ సమీపంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ రెండు ఘటన లలో 23మంది మృతిచెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులను విమానాశ్రయంలోని అత్యవసర ద్వారం నుంచి బయటకు తరలించారు. భద్రతా బలగాలు విమానాశ్రయాన్ని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఎయిర్ పోర్ట్ లో 13మంది, రైల్వే స్టేషన్ లో పదిమంది ప్రాణాలు కోల్పోయారు.

పారిస్‌ దాడిలో నిందితుడిగా ఉన్న సల్లాహ్‌ అబ్దెస్లామ్‌ని బ్రస్సెల్స్‌లో గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టుతో అక్కడ హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేలుళ్లు సంభవించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇది ఉగ్రవాదుల పనేనని విమానాశ్రయ వర్గాలు భావిస్తున్నాయి. పేలుళ్లకు ముందు తుపాకి కాల్పులు కూడా జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయానికి వెళ్లే అన్ని రైలు, బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.

పరిస్థితిని సమీక్షిస్తున్న బెల్జియం ప్రధాని

విమానాశ్రయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని బెల్జియం ప్రధాన మంత్రి చార్లెస్‌ మైఖేల్‌ అంటున్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు, వారికి వేగంగా వైద్య చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

‘విమానాశ్రయానికి ఎవరూ రావద్దు’

విమానాశ్రయంలో జంట పేలుళ్లు సంభవించిన అంశాన్ని బ్రస్సెల్స్‌ ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌వైపు ఎవరూ రావొద్దని, లోపల ఉన్న ప్రజలందర్నీ అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పాయి. విమానాల రాకపోకల్ని రద్దు చేసినట్లు వెల్లడించాయి.

డిల్లీలో భద్రత కట్టుదిట్టం ...

ఇక బెల్జియం బాంబు పేలుళ్ళ నేపధ్యంలో డిల్లీలోని ఎయిర్ పోర్ట్ లో భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేసారు.

ఈ డైరెక్టర్ ను కూడా పవన్ కొట్టాడా?

పవన్‌కు చెక్క గుర్రంపై మోజెందుకు ?

అమితాబ్ జాతీయగీతం సరిగా పాడలేదట

వరుసగా నాలుగు రోజులు బ్యాంక్ లు శెలవు

English summary

Two Bomb blasts have been made occurred in Belgium capital Brussels today. One Bomb Blast blast was occurred in Brussels Airport and another was occurred in Railway Station. In this incident 23 people were died and 35 people were injured upto now.Due to this bomb blasts Belgium Government has announced high alert in the country.