ఇరాక్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 125 మంది మృతి

Bomb blasts in Iraq 125 members was died

10:29 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Bomb blasts in Iraq 125 members was died

ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి ఇరాక్ ని ఎంచుకున్నారు. ఇరాక్ టెర్రరిస్టులు పెట్రేగిపోవడంతో ఆదివారం వరుస పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా 125 మందిని బలిగొన్నారు. మొదట రాజధాని బాగ్దాద్ లో కరాడ ప్రాంతంలో వస్త్ర దుకాణాలు అధికంగా గల ఈ రద్దీ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల్లో పెద్ద సంఖ్యలో జనం మరణించగా.. వంద మందికి పైగా గాయపడ్డారు. అలాగే ఆతర్వాత షల్లాల్ మార్కెట్ వంటి చోట్ల ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లు జరిగాయి. వీటికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

ఉగ్రవాదుల అధీనం నుంచి ఫలూజా నగరాన్ని ఇరాకీ భ్రదతాదళాలు విముక్తం చేసిన వారం రోజులకే ఈ దాడులు జరిగాయి. ఘటనా స్థలాల్లో బీభత్స వాతావరణం నెలకొంది. ఇరాక్ ప్రధాని పర్యటించగా, బాధితుల బంధువులు నిరసన తెలిపారు.

English summary

Bomb blasts in Iraq 125 members was died