సిరియాలో బాంబుల మోత... 100 మంది మృతి

Bomb blasts in Siriya

06:04 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Bomb blasts in Siriya

సిరియాలో బాంబుల వర్షం కురిసింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే జరిగిన ఈ దారుణ సంఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈద్ అల్ అధా సందర్భంగా సోమవారం నుంచి 10 రోజుల పాటు కాల్పులు జరపరాదని అమెరికా, రష్యా శనివారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే తిరుగుబాటుదారుల ప్రాబల్యంలో ఉన్న ఇడ్లిబ్, అలెప్పో నగరాలపై వైమానిక దాడులు జరిగాయని ఉద్యమకారులు చెప్తున్నారు. ఈ దాడుల్లో ఇడ్లిబ్ లో దాదాపు 60 మంది, అలెప్పోలో సుమారు 45 మంది మరణించారని తెలిపారు. ఐసిస్, అల్ ఖైదాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు అమెరికా, రష్యా సైనిక భాగస్వామ్యం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

సిరియాలోని జీహాదీ ఉగ్రవాదులపై సమన్వయంతో వైమానిక దాడులు చేయడానికి నిర్ణయించుకున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలపై కొత్త పరిమితులు విధించాయి. అమెరికా హోం శాఖ కార్యదర్శి జాన్ కెర్రీ మాట్లాడుతూ అమెరికా, రష్యా ఓ ప్రణాళికను ప్రకటిస్తున్నాయన్నారు. సిరియాలో హింసను తగ్గించేందుకు, శాంతి, రాజకీయ మార్పుకోసం ఈ ప్రణాళిక దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సొంత ఇంటిని అమ్మకానికి పెట్టిన టాప్ డైరెక్టర్!

ఇది కూడా చదవండి: మార్కెట్ లో రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు!

ఇది కూడా చదవండి: ప్రభుత్వ కారులో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఆఫీసర్(వీడియో)

English summary

Bomb blasts in Siriya. 100 members was died in this bomb blasts