వీళ్ళిద్దరూ బండబూతులు తిట్టేసుకున్నారు

Bonda Uma vs Koganti Satyam

03:19 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Bonda Uma vs Koganti Satyam

ఒకప్పుడు రాజకీయ నేతలంటే ప్రజలకు గౌరవం ఉండేది. ప్రజల హృదయాలలో నిలిచి పోయేవిధంగా నేతలు వ్యవహరించేవారు. ఇప్పుడు అన్ని రంగాల మాదిరిగానే రాజకీయాలు బ్రష్టు పట్టాయి. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నామో అనే స్పృహ కోల్పోతున్నారు. ఇక పారిశ్రామికవేత్తలు కూడా అలానే వుంటున్నారు. తాజాగా ఓ ఇండస్ట్రియలిస్ట్ - ఓ ప్రజాప్రతినిధి పల్లెటూళ్లలో నీళ్ల పంపుల దగ్గర ఆడోళ్లు తిట్టుకున్నట్టు తిట్టేసుకున్నారు. అది కూడా టీవీ లైవ్ షోలో. దీంతో అంతా బిక్కచచ్చిపోయారు. కొందరు ఆడియన్స్ ఎంజాయ్ చేసేశారు.

ఇంతకీ విషయం ఏమంటే, ఏపీ రాజధాని ప్రాంతం బెజవాడలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఇండస్ట్రియలిస్ట్ కోగంటి సత్యం - ఇటీవల కాలంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ గా తయారవుతున్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు కూల్ వాటర్ పోసినా సరే, పెట్రోల్ లా మండిపోతోందట. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇది కోగంటి సత్యం ఆధ్వర్యంలో సాగుతోంది. దీనికి ఉమా కూడా సహకరిస్తున్నారు. భారీ ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసి, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి టైపులో ఓ రేంజ్ లో ఉత్సవాలు చేద్దామనుకున్నారు.

ఇంతలో చందాల విషయంలో సత్యం - బోండాల మధ్య వివాదం వచ్చేసింది. చినికి చినికి గాలివానై.. ఇద్దరూ తమస్థాయిని మరిచిపోయి, తిట్టుకునే స్థాయికి వచ్చింది. ఈ సమయంలోనే ఓ టీవీ ఛానెల్ వాళ్లు ఇద్దరినీ కూర్చోబెట్టి లైవ్ డిబేట్ చేపట్టారు. శుక్రవారం రాత్రి జరిగిన డిబేట్ లో ఇద్దరూ నేరుగా ఒకరి గురించి ఒకరు పంచాంగం విప్పేసుకున్నారు. నువ్వు రౌడీవి అంటే.. నువ్వే రౌడీవి అంటూ తెగ తిట్టి పోసుకున్నారు. అసలు వీల్లద్దరి మధ్య రంజుగా సాగిన తిట్ల యవ్వారం చూద్దాం.

బోండా ఉమ: నువ్వు(కోగంటి సత్యం) ఎన్నిసార్లు జైలు కెళ్లావో చెప్పాలి.

కోగంటి సత్యం: నీ మీదున్న రౌడీ షీట్ ను అప్పటి సీఐ రామారావు కాళ్లు పట్టుకుని నువ్వు తీయించుకున్నావు. నేను అతని కాళ్లు పట్టుకోలేదు. దీంతో నా పైన కేసుంది గానీ లేకపోతే కేసు ఉండేది కాదు.

ఉమ: నువ్వు రౌడీవని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. నీపై మర్డర్ కేసులున్నాయి కూడా.

సత్యం: నువ్వు రాజకీయ రౌడీవి. నన్ను రౌడీ అంటావా? నా పేరు చెప్పుకుని నువ్వు ఎన్నో సెటిల్ మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకున్నావు. నేను షోడాలు అమ్ముకుని జీవితంలో పైకి వచ్చా. నువ్వు నాలాంటోళ్ల దగ్గర పని చేసి ఎదిగావు.

ఉమ: నేను 30000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా.

సత్యం: అది నీ గొప్పతనం కాదు. చంద్రబాబు వల్ల నీకు లభించింది. నీ పదవికి రాజీనామా చేసిరా. ఇద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం. ఎవరి సత్తా ఏంటో తెలిసిపోద్ది. ఇదండీ వీరిద్దరి మధ్య సాగిన తిట్లు కారణంగా ఒకరి జాతకాన్ని మరొకరు బయట పెట్టేసారు. ఇక ప్రజలే నిర్ణేతలు.

English summary

Bonda Uma vs Koganti Satyam