శ్రీదేవి సినిమాకి పాకిస్థాన్ దెబ్బ.. భయపడుతున్న బోనీకపూర్!

Boney Kapoor is worrying about Sridevi movie

04:28 PM ON 25th October, 2016 By Mirchi Vilas

Boney Kapoor is worrying about Sridevi movie

ఏ నిమిషానికి ఏమి జరుగునో... అన్నాడో సినీకవి... కరెక్ట్ గా అతిలోక సుందరి శ్రీదేవి విషయంలో అదే జరిగింది. అటొచ్చి, ఇటొచ్చి పాకిస్తాన్ సెగ ఇప్పుడు ఈ వెటరన్ హీరోయిన్ కు తగిలింది. ఇంతకీ విషయం ఏమంటే, ఆమె నటిస్తున్న సినిమాలో ఇద్దరు పాకిస్తాన్ నటులు నటించడంతో షూటింగ్ కూడా జరగని పరిస్థితి ఏర్పడిందట. ప్రస్తుతం పాకిస్తాన్ సెగ బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్ పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం... ఆ తర్వాత ఎదురైన పరిణామాల నేపథ్యంలో పాక్ నటులున్న భారతీయ చిత్రాలను రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్(ఎంఎన్ఎస్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నమామ్ సినిమాలో ఇద్దరు పాక్ నటులు నటిస్తున్నారు. దీంతో పాక్ తుఫాన్ శ్రీదేవి సినిమాకు తాకింది. మామ్ లో అద్నాన్ సిద్ధికీ, సజల్ అలీ నటిస్తున్నారు. ఇందులో శ్రీదేవి భర్తగా అద్నాన్ సిద్ధికీ నటిస్తుండగా, కూతురుగా సజల్ అలీ నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ ను ముంబైలో మొదలు పెట్టాల్సి వుంది.. ఎంఎన్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో మామ్ షూటింగ్ కు సైలెంట్ గా బ్రేక్ చెప్పారట ఈ సినిమా నిర్మాత, శ్రీదేవి భర్త అయిన బోనీకపూర్. ఇప్పటికే ఈ చిత్రానికి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించడంతో పాక్ నటులకు బదులు వేరే నటులతో రీషూట్ చేయడం ఇబ్బందే.

కాబట్టి పొలిటికల్ వేడి చల్లారేవరకు వేచి ఉంటే బెటరని నిర్ణయం తీసుకున్నారట. మరి ఈ పొలిటికల్ వేడి ఎప్పుడు చల్లారుతుందో.. శ్రీదేవి సినిమాకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాలి. ఇక శ్రీదేవి వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలని పలువురు నెటిజన్లు జోకులేస్తున్నారు.

English summary

Boney Kapoor is worrying about Sridevi movie