ఆ దెబ్బకు మాధవన్ పళ్ళు రాలిపోయాయా ?

Boxer Ritika About Her Shooting Experience In Sala khadoos

09:34 AM ON 9th February, 2016 By Mirchi Vilas

Boxer Ritika About Her Shooting Experience In Sala khadoos

ఒకప్పుడు పరుగుల రాణీ అశ్వినీ నాచప్ప కథానాయిక గా నటించి హిట్ కొడితే, మళ్ళీ ఇన్నాళ్ళకు అదేకోవలో వచ్చిన రితికాసింగ్‌ కూడా విజయం అందుకుంది. అయితే ఈమె మాత్రం పరుగుల రాణి కాదు బాక్సర్. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం లో హీరో మాధవన్‌తో కల్సి రితికా నటించిన సంగతి తెల్సిందే. మనదేశంలో ఓ బాక్సర్‌ హీరోయిన్‌ కావడం ఇదే తొలిసారి. అంతేకాదు రితికాసింగ్‌ బాక్సర్‌ మాత్రమే కాదు.. ‘మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్‌’ ఛాంపియన్‌ కూడా. ఆ ఛాంపియన్‌ కథానాయికగా మారి విఅజ్యాన్ని అందుకుంది.

ఇంతకీ ఈ సిన్మాలో ఏం చేసిందంటే, రితికా మాటల్లో విందాం ... ' సినిమా చిత్రీకరణప్పుడు ఫైట్‌ సీన్లలో నటించడం నాకు రాలేదు. దర్శకురాలిగా ‘యాక్షన్‌’ అనగానే నిజంగానే ఎదుటివాళ్లపై నాదైన శైలిలో కొట్టేసేదాన్ని!! ఇక హీరో మాధవన్‌తో నటించేటప్పుడూ అదే తప్పు చేశా. దాంతో నా దెబ్బకు అతని ముందుపళ్లు రెండు ఎగిరిపోయాయి. ఆ సినిమాకి మాధవన్ హీరోనే కాదు నిర్మాత కూడా! పైగా అందాల నటుడు. మరి అలాంటి మనిషి పళ్లు ఎగిరిపోతే ఎలా అందుకే ఈ హఠాత్ పరిణామానికి వణికిపోయా' అంటూ వివరిస్తోంది. మరి మాధవన్ ఏమన్నాడంటే, ‘డోన్ట్‌వర్రీ.. నేనే ప్రాక్టీస్‌ లేకుండా ఫైట్‌ చేశా. నాదే తప్పు’ అంటూ నాకు సర్ది చెప్పడం మరువలేను అని రితికా చెప్పింది. ఏది ఏమైనా విరిగిన పళ్లని మాధవన్ కట్టించుకున్నా, జీవితాంతం నేను ‘సారీ’ చెబుతూనే ఉండాలని నిర్ణయించుకున్నా' అని రితికా చెబుతోంది. మరి క్రీడాకారిణి లను హీరోయిన్ లుగా తెచ్చుకుంటే, ప్రమాద మెమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Heroine named Boxer Ritika Singh who acted in Sala Khadoos said her shooting experince in her latest movie Sala Khadoos .She said that she unexpectedly beat R.Madhavan while in Shooting.