మళ్ళీ బోరు బావిలో బాలుడు 

Boy Fells In Bore Well

01:34 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Boy Fells In Bore Well

ఒకటా రెండా , ఎన్నిసార్లు ఇలా జరిగినా , మళ్ళీ కథ మొదటికే అన్నట్లు వ్యవహారం వుంది. లేకపోతే బోరు బావుల్లో బాలుడో , బాలికో పడడం , తల్లి దండ్రుల ఆవేదన , మొత్తానికి రేయింబవళ్ళు శ్రమించి తీయడం , వీటి గురిచి లైవ్ చానళ్ళ లో చూసి , చూసి జనం ఉత్కంఠ ఎదుర్కోవడం .... మామూలైపోయింది తప్ప , వీటిని నిరోధించే చర్యలు శూన్యం. తాజాగా మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మ రెడ్డి గూడెంలో ఈ వేకువఘామున 5.30గంటల ప్రాంతంలో మూడేళ్ళ బాలుడు బోరు బావిలో పడ్డాడు. స్థానికులు స్పందించి బాలుడిని రక్షించే చర్యలు చేపట్టారు. గడిచిన 8గంటలుగా ఈ కసరత్తు సాగుతోంది. 40అడుగుల లోతున్న బోరుబావిలో పడిన బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు. బోరు బావిలో వున్న బాలుడిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నం సాగుతోంది. కానీ ఇలాంటి ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు మాత్రం కనిపించడం లేదు. తెలంగాణాలో చాలా చోట్ల నేలను ఆనుకుని బోరు వావులు కోకొల్లలు గా వుంటాయి. వీటి బారిన పడకుండా చర్యలు తీసుకోవడం , ప్రజల్లో అవగాహన కల్పించడం , బోరు బావులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వంటి విషయాల్లో శ్రద్ధ లోపించడం వల్లనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో అక్కడక్కడ కొన్ని చర్యలు కాకుండా పూర్తిస్థాయి చర్యలపై ఇకనైనా ద్రుష్టి సారించాలి.

English summary

Recent times there were too many cases that small children are faaling in bore wells.Recently a three old boy fells in bore while playing in medak district,telangana