వామ్మో ... అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ !?

Boy Friends For Rent Services In China

11:01 AM ON 25th January, 2017 By Mirchi Vilas

Boy Friends For Rent Services In China

అద్దెకు ఇల్లు, అద్దెకు ఆఫీసులు దొరకడం , వాటికోసం వెతకడం సహజం. కానీ, అసలు ఇలాంటి వ్యవహారం ఉంటుందా అనుకుంటాం. ఇక సంప్రదాయ వాదులకు తెలిస్తే, లోకం పాడైపోయిందని ఒకటే గొడవ చేస్తారు. మరి అక్కడ నిజంగా అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతారు. బ్రాయ్ ఫ్రెండ్ కు ఉండాలనుకున్న అర్హతలను బట్టి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.10-15 వేల వరకు చెల్లించేందుకు సిద్ధమైతే అందమైన(నకిలీ) బాయ్ ఫ్రెండ్ ను సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది మనదేశంలో మాత్రం కాదండోయ్. ప్రస్తుతం పొరుగు దేశం చైనాలో ఈ ట్రెండ్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో చైనా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోనుండడంతో బాయ్ ఫ్రెండ్స్ కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంతకీ ఇలా నకిలీ బాయ్ ఫ్రెండ్ లను తెచ్చుకోవాల్సివాల్సిన ఖర్మ అక్కడి అమ్మాయిలకు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే, విషయంలోకి వెళ్లాల్సిందే.

సొంత ఊరిని విడిచి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లిన అమ్మాయిలు నూతన సంవత్సరం రోజున ఇంటికి చేరుకుంటారు. పెళ్లీడొచ్చిన అమ్మాయిలు ఇంటికి చేరడంతో వారికి వివాహం చేసి పంపించేందుకు ఇదే మంచి తరుణమని కుటుంబ సభ్యులు భావించి పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తుంటారు. దీంతో పెద్దల ప్రపోజల్స్ నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు ఇలా నకిలీ బాయ్ ఫ్రెండ్స్ ను తమతోపాటు ఇంటికి తీసుకొచ్చి పెద్దవాళ్లకు పరిచయం చేయాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అప్పటికి ఆ గండం నుంచి గట్టెక్కవచ్చనేది వారి భావన. జనవరి 28న జరుపుకోబోయే నూతన సంవత్సర వేడుకల కోసం ఇప్పటికే చాలామంది అమ్మాయిలు నకిలీ బాయ్ ఫ్రెండ్స్ తో ఇళ్లకు బయలుదేరారు. సందట్లో సడేమియా అన్నట్టు బాయ్ ఫ్రెండ్స్ ను సరఫరా చేసేందుకు పలు సంస్థలు కూడా వెలిశాయి. ఇక బాయ్ ఫ్రెండ్ గా ఇంటికి తీసుకెళ్లబోయే వ్యక్తితో అమ్మాయిలు ముందుగానే పరిచయం పెంచుకుని వారి వివరాలు సేకరిస్తున్నారట. ఇంటికెళ్లాక తల్లిదండ్రులు అతడి వివరాలు అడిగితే తడుముకోకుండా చెప్పేందుకే ఇలా చేస్తున్నారట. ఏది ఏమైనా ఇప్పుడు చైనాలో అద్దె బాయ్ ఫ్రెండ్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇది చూసి మనవాళ్ళు కూడా అలా ముచ్చట పడరు కదా అని పలువురు గుసగుసలాడుకొంటున్నారు.

ఇవి కూడా చదవండి: వంకాయ ఎంత తింటే ... అంత మంచిదా !

ఇవి కూడా చదవండి: బాప్ రే .. ఆ మూవీ అంతా అవే సీన్లా(వీడియో)

English summary

China was one of the largest and well developed Country in the world and recently a new service was started in China that provides Boy Friends for rental. This service has been huge demand in China.