రూ.10 కోట్లు డిమాండ్ - అంతలోనే హతమార్చారు

Boy Kidnapped And Murdered For Money In Hyderabad

12:20 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Boy Kidnapped And Murdered For Money In Hyderabad

ఘోరాలకు , దారుణాలకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. ఎందుకు చేస్తున్నారో , ఎవరు చేస్తున్నారో , అసలు ఈ దారుణాలకు కారణం ఏమిటో తెలీని విచిత్ర దుస్థితి రాజ్యమేలుతోంది. తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ గగుర్పాటుకి గురించేసింది. కంట తడి పెట్టిస్తోంది.   ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమ యజమాని కుమారుడు. టిఫిన్‌ తెచ్చుకోడాకని ద్విచక్రవాహనం మీద బయటకు వెళ్లాడు.. కొద్దిసేపటిలోనే ఎవరితోనో అదే బండిమీద ఎక్కి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది.తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నుంచి అతడి తండ్రికి ఫోన్‌ కాల్‌ రావడం ,. రూ. 10 కోట్లు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించడం, అంతలోనే క్రూరంగా చంపి అట్టపెట్టెలో పెట్టి రోడ్డు మీద వదిలి పరారవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇంతకీ అలా వదిలి వెళ్లినవారు ఎవరు? ఆ బాలుడు అపరిచితుడికి బండి అప్పగించి తను వెనుక కూర్చుని ఎందుకు వెళ్లాడు? డబ్బు కోసమని ఫోన్‌ చేసినవాళ్లు అంతలోనే ఎందుకు చంపేశారు? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. అత్యంత విషాదకరమైన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే ....

పది కోట్లు ఇవ్వలేదని శవంగా మార్చారు

రోజాకు సరే , మరి నా సంగతేంటి?

‘ఇంటర్నెట్‌ స్టార్‌’ మోడీ యే ...

ఆ డబ్బు స్వచ్చంద సంస్థలకి ఇవ్వమంటున్న

1/9 Pages

కవలల్లో ఒకడు అభయ్ 

     హైదరాబాద్‌ గోషామహల్‌ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ మోదానీ అనే ప్లాస్టిక్‌ పరిశ్రమ యజమాని కుమారుడిని అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలుడిని దారుణంగా హత్య చేశారు. రాజ్‌కుమార్‌ మోదానీకి అభయ్‌ (16) అభిషేక్‌ అనే కవలలు ఉన్నారు. ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. బుధవారం సాయంత్రం అభయ్‌ ఇడ్లీల కోసం ఇంటికి సమీపంలోని టిఫిన్‌సెంటర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. చాలాసేపయినా రాకపోవడంతో తల్లి అనురాధ అభయ్‌కు ఫోన్‌ చేసింది. 5నిమిషాల్లో వస్తానని చెప్పాడట.  20 నిమిషాలు దాటినా ఇంటికి చేరకపోవడంతో తల్లి మరోసారి ఫోన్‌ చేయబోతే స్విచ్‌ఆఫ్‌ అని వచ్చింది. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. 7గంటల వరకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. ఆచూకీ తెలియలేదు. రాత్రి 7.30 గంటలకు బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.

English summary

A Teenage Boy who was studying tenth class in Hyederabad Kidnapped and Murdered by Unknown people. Teenage Boy Abhay was the son of the Popular Businessman Raj Kumar.Police filed case on this incident and started investigation on this issue.