శునకంతో బాలుడుకి పెళ్లి....

Boy Married To Dog

12:47 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Boy Married To Dog

మూఢ నమ్మకా లకు మనదేశంలో కొదవలేదు. ఎన్ని సంస్కరణలు తెచ్చినా , ఎన్ని చైతన్య సదస్సులు పెట్టినా , ఇంతా మొత్తుకున్నా జరిగిపోయేవి జరిగిపోతున్నాయి. చేసేవి చేసేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు ప్రజల్లో ఎంత చైతన్యం కల్పిస్తున్నా ఫలితం శూన్యం. తాజాగా ఓ బాలుడికి శునకంతో పెళ్లి చేసిన సంఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. ఇంతకీ దీని కధాకమామిషు ఏమంటే, జార్ఖండ్‌లోని సరైకేలా ఖర్సావన్ ప్రాంతంలో దుష్ట శక్తులు వదిలిపోతాయన్న నెపంతో ముఖేష్‌ అనే ఓ బాలుడికి శునకంతో పెళ్లి జరిపించేసారు. శునకాన్ని పెళ్లికూతురు లాగే అందంగా అలంకరించి మరీ పెళ్లి చేయడం విశేషం.ఆ బాలుడికి నోటి పైవరుసలో ఒక దంతం వచ్చింది. ఈ విధంగా దంతం రావడం అశుభమని బాలుడి కుటుంబ సభ్యులు భావించి, ఈ పెళ్లిని జరిపించారు. శునకాన్ని వధువులా తయారు చేసి ముఖేశ్‌తో దానికి పెళ్లి చేశారు. ఈ విధంగా చేస్తే, దుష్టశక్తులు బాలుడి దరి చేరవని వారి నమ్మకం. ఈ తరహా పెళ్లిళ్లను ప్రతి ఏడాది అక్కడ జనవరి 15 నుంచి 21 తేదీల్లోపు నిర్వహిస్తుంటారట. ఇంకా నయం దాంతోనే కాపురం చేయమనలేదు ... నవ్విపోదురు గాక....

English summary

A boy named mukesh was married to a dog in jharkhand. Every year january 15 to 21 this type of marriages occur in Jahrkhand