అబ్బో! బోయపాటి భలే ఛాన్స్ కొట్టేసాడు..

Boyapati Srinu gets golden chance

01:21 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Boyapati Srinu gets golden chance

గోదావరి పుష్కరాల సందర్భంగా సినీ సెన్షనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి దక్కాల్సిన గౌరవం, దురదృష్టం దెబ్బతీస్తే, ఆ పుష్కరాల స్ఫూర్తి కృష్ణా పుష్కరాలలో అరుదైన గౌరవం తెచ్చిపెట్టింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా పుణ్య తేజో పీఠంపై నవ దుర్గలను ఏర్పాటు చేసి, పవిత్ర హారతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సినీ దర్శకులు బోయపాటి శ్రీనుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంశల జల్లు కురిపించారు. వారం రోజుల వ్యవధిలోనే హారతుల ఏర్పాట్లు పూర్తి చేసి, తొలి రోజు ప్రారంభ వేడుకలు వైభవంగా నిర్వహించటంతో, పవిత్ర హారతుల కోసం నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముగింపు వేడుకలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహించటంతో బోయపాటిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించి శాలువతో సత్కరించారు.

సీనియర్ నటుడు, ఎంపీ మాగంటి మురళీమోహన్ అయితే బోయపాటి శ్రీనును వెంటబెట్టుకుని కేంద్రమంత్రులకు పరిచయం చేశారు. గోదావరి పుష్కరాల తొలిరోజున తొక్కిసలాట సంభవించి 29 మంది మృత్యువాత పడ్డారు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అప్పట్లో షూటింగ్ జరపడం, దానికి బోయపాటి నేతృత్వం వహించినట్లు వార్తలు రావడం, షూటింగ్ కోసం సీఎం ఎక్కువ సేపు రేవులో ఉండడం తదితర కారణాల వలన జనం రద్దీ పెరిగిపోయి తొక్కిసలాట జరిగిందని, అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే కృష్ణా పుష్కరాలలో అలాంటి బెడద లేకపోవడం బోయపాటికి ప్లస్ పాయింట్ అయింది. దీంతో అరుదైన గౌరవం దక్కింది.

English summary

Boyapati Srinu gets golden chance