గర్ల్ ఫ్రెండ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగివ్వాలని కేసు పెట్టాడు! ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

Boyfriend demands to return back money from his girlfriend

01:36 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Boyfriend demands to return back money from his girlfriend

విక్టరీ వెంకటేష్ నటించిన 'మల్లీశ్వరి' చిత్రంలో వెంకటేష్ తాను కత్రినా కైఫ్ కు ఖర్చు పెట్టిన మొత్తాన్ని లిస్టు రాసుకుని ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలని కోరుతాడు. ఆ సన్నివేశం థియేటర్ లో ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్విస్తుంది. సరిగ్గా ఇలాగే నిజ జీవితంలో కూడా జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన జుర్ స్కోయ అనే యువతి ఇష్టపడే ఓ వ్యక్తితో డేటింగ్ కు వెళ్లింది. అతడితో మూడు రోజుల పాటు జాలీగా ట్రిప్ గడిపింది. ఆ ట్రిప్ లో తన బాయ్ ఫ్రెండ్ ఐలవ్ యూ చెప్తాడని ఎంతగానో ఆశించింది. కానీ మూడు రోజులు పాటు సరదాగా గడిపిన ఆ యువకుడు ఆమెకు మాత్రం ఐలవ్ యూ చెప్పలేదు.

సరేలే అనుకుని రెండు రోజులు బాధపడిన తర్వాత మూడో రోజు ఆ అబ్బాయి నుండి లీగల్ నోటీసు వచ్చింది. ఆ నోటీస్ ను చూసిన యువతి షాక్ కు గురైంది. మూడు రోజులు పాటు తనకు ఖర్చు చేసిన మొత్తాన్ని ఆ యువకుడు ఇవ్వాల్సిందిగా నోటీసు పంపించాడు. రెస్టారెంట్, కాఫీ షాప్, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని బిల్లులను లిస్టుగా రాసి పంపి తనకు రావాల్సిన మొత్తంను చెల్లించాలని డిమాండ్ చేశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడనుకుంటే ఇలా షాక్ ఇచ్చాడేంటా అని ఆ యువతి ఇలా షాక్ తింది. ఆ తర్వాత తేరుకుని అతడితో మాట్లాడే ప్రయత్నం చేసింది..

అప్పుడు ఆ యువకుడు ఇద్దరం కలిసి జాలీగా ట్రిప్ కి వెళ్లాం, మనిద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు నీకోసం అంత డబ్బు ఖర్చు పెట్టాలని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఫోన్ పెట్టేసిన ఆ యువతి అతడికి ఇవ్వాల్సిన మొత్తం డబ్బుని అతనికి ఇచ్చేసింది. ఆ యువకుడికి 2500 డాలర్లను యువతి తిరిగి ఇచ్చినట్లుగా రష్యా మీడియా తెలిపింది.

English summary

Boyfriend demands to return back money from his girlfriend