ఫేస్‌బుక్ చాటింగ్ లోఅబధ్ధాలు చెప్పేది ఎవరో తెలుసా?

Boys or Girls that tell lies in Facebook chat

12:59 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Boys or Girls that tell lies in Facebook chat

ఈ సాంకేతిక యుగంలో ఏదైనా లేని వారు ఉండొచ్చేమో గానీ సెల్‌ఫోన్ లేని వారు ఉండరు... ఇంకా కొంచెం ముందుకెళితే, అసలు ఫేస్‌బుక్ ఖాతా లేని వారు కూడా ఎవ్వరూ ఉండరు. అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే, స్నేహితులతోనో, ప్రేయసి/ప్రియుడితోనో, బంధువులతోనో నిత్యం ఫేస్‌బుక్‌లో చాట్ చేస్తుంటారు. మరికొంతమంది ట్విట్టర్‌తో తమ భావాలను ట్వీట్ చేస్తారు. నేటి యువత డైరెక్టుగా కలిసి మాట్లాడుకోవడం కన్నా, సోషల్ మీడియా ద్వారా నే ఎక్కువగా కబుర్లాడుకుంతున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఇంతటి పవర్ ఫుల్ మీడియా గా ఉన్న సోషల్ మీడియాలో మానవ సంబంధాలు ఆధారపడి వున్నాయని చెప్పడంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు.

ఇది కూడా చదవండి: పంది కడుపున వింత ఏనుగుపిల్ల

అయితే సోషల్ మీడియాలో వున్నవాళ్లలో ఎంతమంది నిజాలు చెబుతున్నారనే విషయాన్ని లండన్‌కు చెందిన ఓ ఆన్‌లైన్ సర్వే సంస్థ సర్వే చేసింది. వాటి వివరాలను తాజాగా వెల్లడించింది. దాదాపు రెండు వేల మంది పై సర్వే చేయగా కేవలం 18 శాతం మంది మాత్రమే సోషల్ మీడియాలో నీజాయితీగా ఉంటున్నారని, ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే వాస్తవాలు మాట్లాడుతున్నారని ఆ సర్వే పేర్కొంది. ఫేస్‌బుక్‌లో ఎక్కువగా అబద్ధాలు చెప్పేది అమ్మాయిలా? అబ్బాయిలా? అనే ప్రశ్నకు పురుషులే అనే సమాధానం వచ్చిందని సర్వే నిర్వాహకులు తేల్చారు.

ఇది కూడా చదవండి: బెడ్ మీద ఆ పని చేస్తూ కంగనను ఇబ్బంది పెట్టాడు

సోషల్ మీడియాలో పెట్టే ప్రొఫైల్‌కు, నిజ జీవితానికి పొంతన ఉండదని 43 శాతం మంది పురుషులు చెప్పారట. ఫేస్‌బుక్‌తో ఎక్కువమంది తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆసక్తి కలిగించే అంశాల్ని పోస్ట్ చేస్తున్నట్టు సర్వే తెలిపింది. మరి ఈ లెక్కన అమ్మాయిలే నయం అన్నమాట. ఎందుకంటే అమ్మాయిల పేరిట ఖాతాలు తెరచి, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నది కూడా పురుష పుంగవులేనని కూడా ఇటీవల మరో సంస్థ సర్వే వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ కి రూ 700 జరిమానా

English summary

Boys or Girls that tell lies in Facebook chat. 43% of boys tells lies in Facebook chatting.