షాకింగ్ న్యూస్ : అందమైన అమ్మాయిల ఫోన్ నంబర్ల విక్రయం

Boys teasing girls by buying their numbers in market

02:45 PM ON 4th February, 2017 By Mirchi Vilas

Boys teasing girls by buying their numbers in market

యూత్ వీక్ నెస్ ని క్యాష్ చేసుకోడానికి రకరాకాల ఎత్తుగడలు వేసేది కొందరైతే, వ్యాపారం కూడా అడ్డంగా చేసేవాళ్ళు మరికొందరు. ఇంకాస్త ముందుకెళ్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరం కేంద్రంగా రీచార్జీ అవుట్ లెట్లలో అందమైన అమ్మాయిల ఫోన్ నంబర్ల విక్రయ దందా జోరుగా సాగుతోంది. కొందరు యువకులు అమ్మాయిల మొబైల్ ఫోన్ నంబర్లను రీచార్జీ అవుట్ లెట్లలో కొనుక్కొని...వారితో ‘‘నీతో స్నేహం చేయాలని ఉంది’’ అంటూ అమ్మాయిలకు ఫోన్ లో వేధింపుల పర్వానికి తెర తీస్తున్నారు. తమ మొబైల్ ఫోన్లలో రీచార్జ్ చేయించుకునేందుకు వచ్చిన అమ్మాయిల ఫోన్ నంబర్లను సేకరించిన రీచార్జీ అవుట్ లెట్ల యజమానులు ఆయా నంబర్లను ఆకతాయిలకు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంతోపాటు పలు పట్టణాల్లో ఇదో కొత్త రకం దందా జోరుగా సాగుతోంది. ఈ దందా గురించి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 1090 నంబరుతో ప్రారంభించిన పోలీసు హెల్ప్ లైన్ కు ఆరు లక్షల ఫిర్యాదులు వచ్చాయట. ఈ ఫిర్యాదుల్లో 90 శాతం మంది మహిళలు తమకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేధిస్తున్నారని పేర్కొనడంతో అసలు అమ్మాయిల ఫోన్ నంబర్ల విక్రయ బాగోతం వెలుగు చూసింది. పోలీసు హెల్ప్ లైన్ కు వచ్చిన ఫిర్యాదుల్లో 5,82,854 ఫిర్యాదులు అమ్మాయిలు చేసినవే కావడం విశేషం. అందులోనూ తమను ఫోన్ లో వేధిస్తున్నారని పేర్కొనడంతో పోలీసులు అప్రమత్తమై ఈ ఫోన్ నంబర్ల విక్రయ రాకెట్ బాగోతాన్ని బట్టబయలు చేశారు.

ఇది కూడా చూడండి: ఇక రాబోయేవి బొద్దింక పాలు?

ఇది కూడా చూడండి: అది మెడా ... బొంగరమా(వీడియో)

English summary

some boys are teasing girls by buying their numbers in market.