వివాదంలో చిక్కుకున్న ఉపేంద్ర 'బ్రాహ్మణ' ట్రైలర్

Brahmana movie trailer

01:44 PM ON 17th June, 2016 By Mirchi Vilas

Brahmana movie trailer

కన్నడ మెగాస్టార్ ఉపేంద్ర నటించిన తాజా చిత్రం బ్రాహ్మణ. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యడానికి ఆ చిత్రం ట్రైలర్ విడుదల చెయ్యగా ఇప్పుడు అది వివాదంలో చిక్కుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించడంలో ఉపేంద్రది ఒక ప్రత్యేకమైన శైలి. తన సొంత దర్శకత్వంలో చేసిన ఎ, రా, ఉపేంద్ర వంటి చిత్రాలు తెలుగులో అప్పట్లో ఎంత హల్ చల్ చేసాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్య 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో కీలక రోల్ చేసిన ఊపేంద్ర ఆ సినిమాకి మంచి మార్కులే తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఆయన తాజా చిత్రం తెలుగులో 'బ్రహ్మణ' పేరుతో విడుదల అవ్వడానికి సిద్ధమైంది.

అయితే ఇది కన్నడంలో 'శివం' గా విడుదలైంది. అక్కడ మొదట బసవణ్ణ అనే టైటిల్ ను నిర్ణయించినా వివాదాలు రావడంతో 'శివం' పేరుతో రిలీజ్ చేసి విజయం సాధించారు. అయితే తెలుగు వర్షన్ కు 'బ్రాహ్మణ' అనే టైటిల్ కూడా వివాదస్పదమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే మన సినిమాల్లో బ్రాహ్మణులను కించపరుస్తున్నారంటూ చాలా వివాదాలు జరిగాయి. ఇప్పుడు ఉపేంద్ర ఏకంగా ఓ యాక్షన్ సినిమాకు 'బ్రాహ్మణ' అనే టైటిల్ ను పెడితే సహిస్తారా? సరే ఎమైనా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఇందులో ఉపేంద్ర రెండు కోణాల్లో కనిపించినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ ట్రైలర్ పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Brahmana movie trailer