సినిమాల నుంచి తప్పుకుంటున్న బ్రహ్మీ

Brahmanandam is quitting from movies

11:03 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Brahmanandam is quitting from movies

ఆరోజుల్లో కామెడీ కింగ్ గా ఓ వెలుగు వెలిగిన రేలంగికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రస్తుత పరిస్థితులలో అదే క్రేజ్ ని సంపాదించుకున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం 30 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతూ తనదైన ముద్ర వేసాడు. అయితే మానవ జీవితంలో ఎలా ఎత్తు పల్లాలు ఉంటాయో.. సినీ జీవితంలో కూడా అలాగే ఆటుపోట్లు ఉంటాయి. బ్రహ్మానందానికి కూడా అటువంటి టైమే వచ్చింది. సినిమాలకు గుడ్ బై చెప్పే టైమొచ్చిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. వాస్తవానికి స్టార్ హీరోలకు కొద్దిగా గ్యాప్ వచ్చినా లేక వరుస ఫ్లాప్ లు వచ్చినా మళ్లీ ఒక్క సూపర్హిట్ వస్తే చాలు.. పూర్వ వైభవం వచ్చేస్తుంది.

కానీ హీరోయిన్లు, కమెడియన్ల విషయం అలా ఉండదు. వరుస ప్లాప్ లు వస్తే కెరీర్ కి తగిలే దెబ్బ నుంచి కోలుకోవడం కష్టం. అందుకే కొంచెం అజాగ్రత్త వహించినా కెరీర్ మొత్తం పతనం అవుతుంది. తెరమీద కనబడితే నవ్వులు పండించే బ్రహ్మానందం తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఇక అతని పనైపోయిందనుకున్న సమయంలో మళ్లీ నిలదొక్కుకున్నాడు. కేవలం తన కామెడీతోనే ఎన్నో సినిమాలను నిలబెట్టాడంటే అతిశయోక్తి కాదు. కానీ గత రెండేళ్లుగా అతని పరిస్థితి రివర్స్ గేర్ లో ఉంది. యువ కమెడియన్ల రాకతో బ్రహ్మీని అందరూ పట్టించుకోవడం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాల్లో బ్రహ్మానందం లేకుంటే అందరూ ఆశ్చర్యపడేవారు.

కానీ ఇప్పుడు స్టార్ హీరో సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపోతున్నారు అదీ బ్రహ్మానందం దుస్థితి. ఆయన పై చిన్నగా మొదలైన నెగటివిటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇండస్ట్రీలో ఎవ్వరూ బ్రహ్మీ గురించి ఆలోచించడం లేదు. గత రెండేళ్లలో ఆయన కేవలం సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు చిత్రాల్లో నామమాత్రంగా కనిపించారు. ఇక ఆ తరువాత వచ్చిన బ్రహ్మోత్సవం లో అసలు కనిపించలేదు. ఇక అతడు నుంచి త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే ఆయన అ..ఆ లో కూడా కనిపించలేదు. మొత్తానికి బ్రహ్మీ కెరీర్ కి ఎసరు వచ్చింది. యువ కమెడియన్లు రాకతో ఆయన కెరీర్ చివరి దశకు వచ్చేసిందని.. అందుకే బ్రహ్మీ సినిమాలకు గుడ్ బై చెపుతున్నాడన్న వార్తలు జోరుగా వస్తున్నాయి. మరి అది నిజమో కాదో.

English summary

Brahmanandam is quitting from movies