పోలీసుల అదుపులో 'బ్రహ్మోత్సవం' కెమెరా మెన్?

Brahmotsavam Cameraman Arrested In Tirupati

04:00 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Brahmotsavam Cameraman Arrested In Tirupati

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవం మూవీని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండగా, పీవీపీ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమాకి పనిచేసిన రత్నవేలు ఈ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్నాడు. అయితే తిరుమలలో అనుమతి లేకుండా వీడియో తీస్తున్న అభియోగంపై బ్రహ్మోత్సవం సినిమాకి సినిమాటోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వీడియోగ్రాఫర్లని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో రథసప్తమి వేడుకల్లో భాగంగా జరుగుతున్న శ్రీవారి గరుడ సేవా కార్యక్రమాన్ని వీడియో గ్రాఫర్లు అత్యాధునిక వీడియో కెమెరాలతో షూట్ చేసేస్తున్నారు. అనుమతి లేకుండా ఈ వ్యవహారం చేస్తున్నారని టీటీడీ సిబ్బంది గుర్తించి, ఈ విషయాన్ని పోలీసులకి తెలపడంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. సదరు వీడియో గ్రాఫర్లని అదుపులోకి తీసుకున్నారు. తాము బ్రహ్మోత్సవం మూవీకి పనిచేస్తున్న కెమెరామెన్లమని పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో అనుమతి లేకుండా వీడియో చిత్రీకరణ జరపడం తప్పేనని స్పష్టం చేసిన పోలీసులు వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ట్లు చేబుట్టున్నారు. అయితే ఇది కేవలం సినిమా కోసం చేసిన పనేనా ? మరేదైనా అంశం దాగి వుందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary

Brahmotsavam Cinematographer Ratnavelu was arrested by Tirupati police for shooting Sri Vari Brahmotsavam in High Definition Camera's.This movie was going to release in this summer