'బ్రహ్మోత్సవం' అక్కడ 100 రోజులు ఆడిందట!

Brahmotsavam completed 100 days in Chilakaluripet

04:41 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Brahmotsavam completed 100 days in Chilakaluripet

పెద్ద డిజాస్టర్ గా నిలిచిన 'బ్రహ్మోత్సవం' 100 రోజులు ఆడడం ఏమిటి నవ్విపోదురు గాక అంటారేమో కానీ బ్రహ్మోత్సవం సినిమా విడుదలై వంద రోజులవ్వడమే కాదు.. ఈ సినిమా వంద రోజులు కూడా ఆడింది. కాకపోతే చాలా సెంటర్లలో ఏం కాదు. చిలకలూరిపేటలోని 'విశ్వనాథ్' థియేటర్లో ఈ చిత్రం రోజుకు నాలుగు ఆటలతో వంద రోజులు ఆడిందంటే మామూలు విషయం కానేకాదు. మరి వంద రోజులు ఆడేంత సినిమానా ఇది అంటే మాత్రం ఏం చెప్పలేం. సూపర్ స్టార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పీఆర్వో బీఏ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. మహేష్ బాబు హీరోగా నటించిన 22 సినిమాల్లో 18 డైరెక్టుగా శత దినోత్సవం జరుపుకున్నాయని.. అందులో బ్రహ్మోత్సవం కూడా ఒకటని ఆయన వెల్లడించారు.

ఇక్కడ మరో విశేషం ప్రస్తావించారు. బ్రహ్మోత్సవం 100 రోజుల వేడుక జరుపుకుంటున్న రోజే.. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయి అనదగ్గ 'మోసగాళ్లకు మోసగాడు' 45 వసంతాలు పూర్తి చేసుకుందట. యాదృచ్ఛికంగా ఈ రెండూ కలిసి రావడం మంచి విషయమే కానీ.. బ్రహ్మోత్సవం హిట్ అనిపించుకుని 100 రోజుల వేడుక చేసుకుని ఉంటే ఇంకా బాగుండేదనే మాట నెటిజన్ల నుంచి వినిపించే మాట. ఇక బ్రహ్మోత్సవం చిలకలూరిపేటలో వంద రోజులు ఎలా పూర్తి చేసుకుంది.. జనాలు ఎలా ఆదరించారన్నది అక్కడి వాళ్లకే తెలియాలి. సినిమాకు మొదట్లో ఎలాంటి టాక్ వచ్చింది.. ఎంత కలెక్షన్ వచ్చింది.. ఫైనల్ రిజల్ట్ ఏంటి అన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరమైతే లేదు. ఏది ఏమైనా ఇది కూడా ఓ విధంగా ఓ రికార్డ్ అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఆడవాళ్లు జీవించలేని ప్రమాదకరమైన దేశాలు ఇవే!

ఇది కూడా చదవండి: వరల్డ్ ఛాంపియన్ ని చంపేసిన ప్రభుత్వం!

ఇది కూడా చదవండి: ఆ సినిమా అల్లు శిరీష్ చేసుంటే ఎక్కడికో వెళ్లిపోదును.. కానీ..

English summary

Brahmotsavam completed 100 days in Chilakaluripet. Biggest disaster movie Brahmotsavam completed 100 days in Chilakaluripet.