'బ్రహ్మోత్సవం'లో డైలాగ్స్‌.. .

Brahmotsavam movie dialogues leaked

04:30 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Brahmotsavam movie dialogues leaked

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత కధానాయికలుగా నటిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రియల్‌లో విడుదలయ్యే ఈ చిత్రంలోని డైలాగులు కొన్ని ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. లీకైనా డైలాగులు మిర్చివిలాస్‌ మీ కోసం అందిస్తుంది.

1. నలుగరిలో ఉండటం అంటే నీ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండటం కాదు... నలుగురూ నిన్ను గుర్తించడం.

2. మంచితనం నీ పుట్టుమచ్చ అయితే... దొంగతనం, చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు. ఏ మచ్చలు కావాలో నువ్వే తేల్చుకో...

3. సమస్యలు అలలు లాంటివి వస్తూ ఉంటాయ్‌.. పోతూ ఉంటాయ్‌.. నువ్వు తీరంలా ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలి.

4. సముద్రంలో నీరు, అసమర్ధుడి దగ్గర డబ్బు ఎంతున్నా ప్రయోజనం ఉండదు.

5. ఫ్యామిలీ ప్రాణం లాంటిది.. జాగ్రత్తగా చూసుకోవాలే గానీ, ఎక్కడపడితే అక్కడ మధ్యలో వదిలేయకూడదు

English summary

Brahmotsavam movie dialogues leaked in internet.