రంగురంగుల 'బ్రహ్మోత్సవం' మోషన్ పోస్టర్

Brahmotsavam movie motion poster

11:40 AM ON 28th April, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie motion poster

'శ్రీమంతుడు' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టి దూకుడు మీదున్న ‘ప్రిన్స్’ మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్టిల్ ని ఉగాది రోజున విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్ ఈ రోజు మ‌హేష్‌ తన ట్విటర్ పేజీలో రిలీజ్ చేశాడు. ఈ పోస్ట‌ర్‌లో మహేష్ పొడ‌వుగా ఉన్న‌ మూడు చ‌క్రాల రంగురంగుల బుల్లెట్‌ పై చాలా స్టైల్‌గా వెళుతున్నాడు. బైక్ పై మహేష్ వెనకాల ముగ్గురు హీరోయిన్లు అయిన త‌న మ‌ర‌ద‌ళ్ల‌ను కూడా ఎక్కించుకునేంత పెద్దగా బైక్ ని డిజైన్ చేశారు.

బ్లూకలర్ షర్ట్ జీన్స్ ప్యాంట్ తో కళ్లజోడు పెట్టుకుని మహేష్ భలే అందంగా ఉన్నాడు. ఈ చిత్రంలో సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకసారి ఆ మోషన్ పోస్టర్ ని మీరు కూడా చుసేయండి.

English summary

Brahmotsavam movie motion poster. Mahesh Babu latest movie Brahmotsavam movie motion poster was released by Mahesh in twitter.