'బ్రహ్మోత్సవం'కి ముందు అనుకున్న కధ ఏంటో తెలిస్తే షాకౌతారు!

Brahmotsavam movie original story

04:48 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie original story

'శ్రీమంతుడు' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేద్దామా అని అనుకుంటున్న సమయంలో శ్రీకాంత్ అడ్డాల మహేష్ ని కలిసి బ్రహ్మోత్సవం సినిమా కధ వినిపించాడట. అయితే మనం తెర పై చూసిన కధ కాకుండా శ్రీకాంత్ అడ్డాల వేరే కధని వినిపించాడట. ఆ కధ ఏంటంటే.. మహేష్ బాబు తండ్రి సత్యరాజ్ కి ముగ్గురు చెల్లెల్లు, ఒకానొక సమయంలో ఆ ముగ్గురు చెల్లెళ్లకు ఒకేసారి పెళ్లి అవుతున్న సమయంలో కట్నం గురించి ఓ గొడవ జరిగి ఆ ముగ్గురు చెల్లెల్లు సత్యరాజ్ ని వదిలేసి వెళ్ళిపోతారట. తరువాత మహేష్ ఆ ముగ్గురు అత్తలను వారి కూతుళ్ళ సాయంతో ఎలా తన తండ్రితో కలిపాడు అనేది మిగిలిన కధ.

కానీ ఇది కొద్దిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలా ఉన్నా కానీ ముగ్గురు అత్తలు కాన్సెప్ట్ బాగుంటుంది అని అనుకున్న ఎందుకనో అది కుదరక ఇలా కధని మార్చేశారట. మొదటి కధలో మహేష్ ఏ అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటాడనే ఆసక్తి కూడా ఉండేదట. కానీ ఆ కధని తిరష్కరించడంతో ఇలా డిజాస్టర్ బయటకొచ్చిందని అనుకుంటున్నారు.

English summary

Brahmotsavam movie original story