మే 20నే 'బ్రహ్మోత్సవం' పండగ

Brahmotsavam movie release on May 20

10:23 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie release on May 20

సాధారణంగా తెలుగువారికి పండగలకు కొదవ లేదు. ఇక తమ అభిమాన హీరోల సినిమాల విడుదల కూడా పండగ మాదిరిగా వుంటుంది. అందుకే సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు మే 20న పండగ. 'బ్రహ్మోత్సవం' ఆడియో ఫంక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అతడ్ని ఆకాశానికెత్తుతూ చేసిన స్లోగన్స్ అన్నీఇన్ని కావు. తనను కనీసం రెండు నిముషాలైనా మాట్లడనివ్వాలని మహేష్ కోరడం విశేషం. తన కెరీర్‌కు అండగా ఉండి ఇంతవాడ్ని చేసినందుకు చాలా థ్యాంక్స్ అని, మీరంతా తన గుండెల్లో ఎప్పుడూ ఉంటారని ప్రిన్స్ వాళ్ళను ఉత్సాహ పరిచాడు.

ఫైనల్ గా మే 20న రిలీజ్ డేట్ అంటూ ప్రకటించి సెలవు తీసుకున్నాడు. సో.. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బ్రహ్మోత్సవం' చూడ్డానికి రెడీ అయిపోండి మరి. మే 20నే మనకు పండుగ.

English summary

Brahmotsavam movie release on May 20. Super Star Mahesh Babu upcoming movie Brahmotsavam movie is releasing on May 20th.