బ్రహ్మోత్సవం లో సీన్ లీక్! నిజంగా అద్భుతం

Brahmotsavam movie scene leaked

03:29 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie scene leaked

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. మహేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హేరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల అవ్వనుంది. అయితే తాజాగా 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించిన ఓ షూటింగ్ స్పాట్ సీన్ లీకై సంచలనం సృష్టిస్తోంది. బ్లూ షర్ట్ వేసుకున్న మహేష్ బాబు ముందు నడుస్తుండగా, పింక్ కలర్ కుర్తా లో సమంత అతని వెంట బడుతున్న సన్నివేశం ఇది. ఇలా రిలీజ్ కు ముందే చాలా సినిమా లకి ఇలాంటి పరిస్ధితి ఏర్పడింది.

ఇది కూడా చదవండి: దారుణం మంచి నీళ్ళు తాగాడని రైలుకి కట్టి కొట్టారు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రానికైతే మొదటి భాగం మొత్తం విడుదల అయిపోయి సంచలనం సృష్టించింది. తాజాగా మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రానికి ఈ పరిస్ధితి ఏర్పడింది. అయితే సినిమాల సీన్స్ లీక్ కాకుండా చూసుకోవలసిన బాధ్యత యూనిట్ మీద ఉంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్న ఎక్కడో ఒక చోట పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. లీకేజీలు మాకిది మామూలే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇప్పటికైనా బ్రహ్మోత్సవం చిత్ర యూనిట్ ఇప్పటికైనా మేల్కోని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ఇది కూడా చదవండి: నగ్నంగా నటించడానికి నేను రెడీ..

English summary

Brahmotsavam movie scene leaked. Mahesh Babu upcoming movie Brahmotsavam movie scene were leaked.