ఊటీలో దర్శనమిచ్చిన మహేష్‌!

Brahmotsavam movie shooting doing at Ooty

12:23 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Brahmotsavam movie shooting doing at Ooty

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. పివిపి పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌, ప్రణీత కథానాయకులు. మహేష్‌తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో నిన్నటితో పూర్తయింది. ఇక్కడ షూటింగ్‌ అయిపోయిన వెంటనే బ్రహ్మోత్సవం చిత్ర యూనిట్‌ ఊటీకి బయల్దేరింది. డిసెంబర్‌ 10 నుండి ఈ నెలాఖరు వరకు షూటింగ్‌ ఊటీలోనే జరగనుంది. మిక్కీ జే.మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్‌ నెలలో విడుదల కాబోతుంది.

English summary

Brahmotsavam movie shooting doing at Ooty. This movie is directing by Srikanth Addala.