బ్రహ్మోత్సవం షూటింగ్ వీడియో లీక్!

Brahmotsavam movie shooting video leaked

12:09 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie shooting video leaked

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. మహేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, ప్రణీత, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సత్యరాజ్, నరేష్ వంటి సీనియర్ నటులు కూడా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ చిత్రం మే ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో రిలీజ్‌ కాబోతుంది. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పాటలని చిత్రీకరించే పనిలో పడింది.

ఇందులో‌ భాగంగా పూణెలో షూటింగ్ జరుగుతున్న సన్నివేశాల్ని యూనిట్ సభ్యుడు తన సెల్‌ఫోన్ కెమెరాలో షూట్ చేసి దాన్ని ఇన్‌స్ర్టా‌గ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అందులో ప్రిన్స్ మహేష్ బాబు మాత్రమే కనిపిస్తున్నాడు. ఇక సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని తమిళంలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు పివిపి సంస్థ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 200 స్ర్కీన్స్‌లో రిలీజ్ చేయాలన్నది పివిపి ఆలోచన. ప్రస్తుతం ఒక్క సాంగ్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఫైనల్ షెడ్యూల్‌ని రామోజీ ఫిల్మ్‌సిటీలో పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఆడియో డేట్ ని కూడా ప్రకటించనున్నారు..

English summary

Brahmotsavam movie shooting video leaked. Super Star Mahesh Babu latest upcoming movie Brahmotsavam shooting video leaked. In this movie Samantha, Kajal Agarwal, Pranitha is acting as a heroines.