మహేష్ నన్ను పెళ్లి చేసుకుంటావా?

Brahmotsavam movie song teaser

10:38 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie song teaser

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగులో హాలీవుడ్ హీరోలా ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. లేడీస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న నటుడు మహేష్. అయితే ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. అయితే ఈ చిత్రానికి సంబంధించి 'మధురం మధురం' అనే పాట టీజర్‌‌ను చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా నిన్న రిలీజ్ చేసింది. ఈ టీజర్‌ లో మహేష్‌ బాబును చూసిన ఓ చిన్నారి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు మహేష్‌ అలా నడిచి వస్తుంటే దగ్గరే ఉన్న అమ్మాయిలు సైతం ఆయన్నే చూస్తున్నారు.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌ బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ సంయుక్తంగా సంగీతం అందించారు. సమంత, కాజల్‌, ప్రణీత మహేష్ బాబు సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 7న ఈ చిత్రం ఆడియోను అంగరంగ వైభవంగా విడుదల చెయ్యనున్నారు.


English summary

Brahmotsavam movie song teaser. Super Star Mahesh Babu new movie Brahmotsavam movie Madhuram Madhuram song teaser.