'బ్రహ్మోత్సవం' స్టొరీ లీక్.. షాక్ కి గురైన మహేష్!

Brahmotsavam movie story leaked

04:32 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam movie story leaked

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలన్నీ మూవీ మేకర్స్ ఎంత గోప్యంగా ఉంచినా ఈ చిత్ర కధ మాత్రం బయటకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం స్టొరీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆ లీక్ అయిన స్టోరీ ఇప్పుడు మీకోసం..

ఉమ్మ‌డి కుటుంబానికి చెందిన మ‌హేష్ ఫ్యామిలీ ఎలాంటి కష్టాలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తుంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా మ‌హేష్ తండ్రి చ‌నిపోతాడు. ఆ తరువాత తండ్రి అస్తిక‌ల‌ను కాశీలో క‌లిపేందుకు బయలుదేరిన మ‌హేష్‌కు ట్రైన్ లో హీరోయిన్ స‌మంత‌ ప‌రిచ‌యం అవుతుంది. అయితే సమంతకు తొలి చూపులోనే మహేష్ విపరీతంగా నచ్చేయడంతో, ఆమె తనను పెళ్లి చేసుకోమ‌ని మహేష్ ను అడుగుతుంది. అయితే మహేష్ ఆమె ప్రేమను తిరష్కరిస్తాడు. ఎందుకంటే మహేష్ అప్పటికే త‌న తండ్రి స్నేహితుడి కుమార్తె, ఎన్నారై అయిన కాజ‌ల్‌ను ప్రేమించిన‌ట్టు సమంతకు చెపుతాడు.

కాశీ నుంచి వ‌చ్చాక మహేష్ ను స‌మంత జ్ఞాప‌కాలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే మహేష్ తండ్రి చనిపోతూ తన మేన కోడలు ప్రణీతను పెళ్ళి చేసుకోమని మహేష్ ను కోరతాడు. దీనీతో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మ‌ర‌ద‌లు ప్ర‌ణీత‌ను పెళ్లి చేసుకోవాలా? లేదంటే తాను ప్రేమించిన కాజల్ ను పెళ్ళి చేసుకోవాలా? లేకుంటే తనను ప్రేమించిన సమంతను పెళ్ళి చేసుకోవాలా? అన్న కన్ఫ్యూషన్ లో వచ్చే ట్విస్ట్ లు చుట్టూ తిరిగే కధే ‘బ్రహ్మోత్సవం’ అసలు సారాంశం. అయితే ఈ స్టొరీ నిజమో కాదో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

English summary

Brahmotsavam movie story leaked. Super Star Mahesh Babu latest upcoming movie Brahmotsavam story was leaked. In this movie Samantha, Kajal Agarwal, Praneetha is acting as a heroines.