మహేష్ ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో తెలుసా.?

Brahmotsavam Poster Suspense

03:03 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Brahmotsavam Poster Suspense

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం "బ్రహ్మోత్సవం" . ఈ వేసవికి విడుదల అవ్వనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి ,పివిపి సమర్పణలో ప్రసాద్ వి. పోట్లురి , కెవిన్ అన్నె లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: "సచిన్" ఆత్మ కథ ట్రైలర్

ఇటీవల ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు . ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు ఒక పెద్ద మనిషికి చెప్పులు తోడుగుతున్నట్లుగా కనిపించడంతో , మహేష్ బాబు చెప్పులు తోడుగుతున్నది ఎవరికన్న సందేహం మొదలైంది . అసలు మహేష్ చెప్పులు తోడుగుతున్న ఆ పెద్ద మనిషి కాళ్ళు ఎవరివి అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాతో సైతం చర్చించుకుంటున్నారు . ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉన్న ఆ విషయం పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది .

ఇవి కూడా చదవండి: బాక్సాఫీస్ కింగ్ అని మళ్ళి నిరూపించుకున్న పవన్

"బ్రహ్మోత్సవం" సినిమాలో మహేష్ బాబు తండ్రిగా నటుడు సత్యరాజ్ నటిస్తున్నాడు . ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి మహేష్ బాబు కాళ్ళు పట్టుకున్న వ్యక్తి కచ్చితంగా తండ్రి పాత్ర పోషిస్తున్న సత్యరాజ్ వేనని ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తీ అయిన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది . త్వరలోనే ఈ సినిమా ఆడియో విడుదల తేదితో పాటు , సినిమా రిలీజ్ డేట్ ను కుడా ఈ చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

పెళ్లికూతురితో లేచిపోయిన డైరెక్టర్

మహేష్ కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పూరీ

English summary

Super Star Mahesh Babu's upcoming film was "Brahmotsavam" which was directed by Srikanth Addala. This movie first look poster was released by the movie unit on Ugadi.