విజయవాడలో 'బ్రహ్మోత్సవం' షూటింగ్!!

Brahmotsavam shooting in Vijayawada

09:46 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Brahmotsavam shooting in Vijayawada

శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ని రామోజీ ఫిలిం సిటీ లో, ఆ తరువాత షెడ్యూల్ ఊటీ లో జరిపారు. ఇప్పుడు తాజా షెడ్యూల్ ని విజయవాడ లో జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్, సమంత, కాజల్ మరియు ఇతర తారాగణం పై ముఖ్య సన్నివేశాలని చిత్రీకరిస్తారు.

ఈ చిత్రంలో మహేష్ కి తల్లిదండ్రులు గా సత్యరాజ్, రేవతి నటిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 8న ఈ చిత్రం ఆడియో ని తిరుపతి లో అంగరంగ వైభవంగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తుంది.

English summary

Super Star Mahesh Babu upcoming movie Brahmotsavam movie shooting is held in Vijayawada. This movie is directing by Srikanth Addala. Samantha, Kajal Agarwal and Pranitha is acting as a heroine in this movie.