మహేష్‌తో గొడవ ఉత్తిదే!!!

brahmotsavam shooting stopped is rumour

01:35 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

brahmotsavam shooting stopped is rumour

' కొత్తబంగారు లోకం' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. వరుణ్‌సందేశ్‌, శ్వేతాబసుప్రసాద్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌. ఆ తరువాత సూపర్‌స్టార్‌ మహేష్‌, విక్టరీ వెంకటేష్‌ కలిసి నటించిన మల్టీస్టార్‌ చిత్రం 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇది మంచి కుటుంబ కధగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఆ తరువాత శ్రీకాంత్‌ అడ్డాల నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం 'ముకుంద'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు మహేష్‌ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మూెత్సవం, ఇందులో కాజల్‌, సమంత, ప్రణీత ముగ్గురు కధానాయకులు.

పివిపి సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారు. అనుకున్నట్లుగానే ఘాటింగ్‌ను కూడా శరవేగంగా జరుపుతున్నారు. అయితే నిన్నటికి నిన్న ఈ చిత్ర ఘాటింగ్‌ అర్ధాంతరంగా ఆపేశారనీ పుకార్లు వచ్చాయి. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలకి, హీరో మహేష్‌బాబుకి మనస్పర్ధలు వచ్చాయని వార్తలొచ్చాయి. అయితే దీన్ని నిర్మాతలైన పివిపి సంస్థ ఈ పుకార్లుని ఖండించింది. అటువంటి మనస్పర్ధలేమి చోటు చేసుకోలేదు, అనుకున్న విధంగానే చిత్రాన్ని వేసవిలో రిలీజ్‌ చేస్తాం. ఒక షెడ్యూల్‌ పూర్తయింది.

మళ్లీ ఈ నెల 28 నుండి డిసెంబర్‌ 8 వరకు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. ఆ తరువాత షెడ్యూల్‌ ఊటీలో ప్లాన్‌ చేస్తున్నాం అని చెప్పారు. మహేష్‌కి, శ్రీకాంత్‌ అడ్డాలకి ఎటువంటి గొడవలు లేవు అయితే ఉన్నట్టుండి అటువంటి పుకార్లు ఎందుకొచ్చాయో అర్థంకావడం లేదు అని తెలియజేసారు. బ్రహ్మ్మోత్సవం చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ఘాటింగ్‌ ఒకేసారి పూర్తిచేసి రిలీజ్‌ చేస్తాం అని చెప్పారు.

English summary

brahmotsavam shooting stopped is rumour