బ్రహ్మోత్సవం సాంగ్ మేకింగ్‌ ( వీడియో )

Brahmotsavam Song Making Video

09:45 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam Song Making Video

సూపర్ స్టార్ మహేష్బాబు థానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రంలోని ‘వచ్చింది కదా అవకాశం’.. పాట మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ వీడియో లింక్‌ను పోస్ట్‌ చేసింది. ‘వచ్చింది కదా అవకాశం’ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, మిక్కీ జె. మేయర్‌ సంగీతం సమకూర్చారు. 'ఈ పాట చిత్రీకరణ సమయంలో సెట్స్‌కి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖాన్‌ వచ్చారు. చిత్ర బృందంతో సరదాగా మాట్లాడి వారితో కలిసి ఫొటోలు దిగారు. పాట చాలా బాగా వచ్చింది, ఈ వయసులో కూడా మాకు డాన్స్‌ చేయాలనిపించిందంటే పాట ఎంత బాగుందో చెప్పలేము' అని అలనాటి నటి జయసుధ. అంటున్నారు ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా సమంత ఫస్ట్‌లుక్‌ను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇక శనివారం బ్రహ్మోత్సవం ఆడియో విడుదల కానుంది.త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇవి కూడా చదవండి:ఉదయాన్నే ఉప్పునీరు తాగితే ఎంత లాభమో !

ఇవి కూడా చదవండి:మంటతో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు

English summary

Super Star Mahesh Babu's Brahmotsavam movie unit yesterday released the making video song of the movie. This movie audio to be released today and this movie was going to release on 29th may.