హత్తుకునే డైలాగులతో 'బ్రహ్మోత్సవం' ట్రైలర్‌

Brahmotsavam Theatrical Trailer

09:35 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam Theatrical Trailer

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో మహేష్ బాబు ఈ ట్రైలర్ ను విడుదల చేసారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీతలు మహేష్ సరసన నటిస్తున్నారు. పీవీపీ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జె మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. త్వరలోనే బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి: ఈ వయసులో పెళ్ళి చేసుకుంటే విడాకులే

‘ఎక్కడైన ఒక నలుగురు కలిస్తేనే అందం.. ఆనందం.. అటువంటిది ఒక పది మంది ప్రతి రోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకొంటే ఎంత బాగుంటుంది’.

‘బతకడం అంటే ఒకళ్లనొకళ్లు నమ్ముకోవడం. అమ్ముకోవడం కాదు’ లాంటి మనసుకి హత్తుకునే డైలాగులు ఈ ట్రైలర్‌లో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కుటుంబంలోని ఆప్యాయత, అనురాగాలు సభ్యుల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను ఈ చిత్రం ద్వారా ఎంతో చక్కగా చూపించారు. మొత్తానికి విడుదలకు సన్నద్ధంగా వున్న బ్రహ్మోత్సవం కోసం సినీ జనాలు ఎదురు చూపులు మొదలయ్యాయి. విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే.

ఇవి కూడా చదవండి: వడదెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

ఇవి కూడా చదవండి: రోజులో పెరుగు ఎప్పుడు తింటే మంచిది?

English summary

Super Star Mahesh Babu's Brahmotsavam audio launch was done grandly by the Brahmotsavam movie unit in Hyderabad. This movie songs were released and the Theatrical Trailer was launched by the movie unit . The theatrical trailer was attracting audience by the dialogues in the trailer.